
A behind-the-scenes video from SS Rajamouli's Varanasi featuring Mahesh Babu has gone viral on social media, sparking fresh leak concerns.
ప్రపంచస్థాయిలో తెలుగు సినిమాని నిలబెట్టేందుకు కంకణం కట్టుకుని రాజమౌళి తెరకెక్కిస్తున్న “వారణాసి”కి మొదటినుండి లీకుల బాధ తప్పడం లేదు. ఎంత భారీ సెక్యూరిటీ నడుమ సినిమాని తీస్తున్నప్పటికీ.. సినిమా నుండి ఏదో ఒక కంటెంట్ లీక్ అవుతూనే ఉంది.
తాజాగా సినిమాకి సంబంధించిన బీటీఎస్ కంటెంట్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. 25 సెకండ్ల సదరు కంటెంట్ ట్విట్టర్ లో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. మహేష్ సదరు వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుండడంతో దగ్గరలో ఉన్నవాళ్లే తీశారు అని తెలుస్తోంది.
గతంలోనూ ఒరిస్సా షెడ్యూల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ & మహేష్ బాబు కాంబినేషన్ సీన్ మొత్తం లీక్ అయిపోయింది. అది ఎవరో బస్ లో నుండి సీక్రెట్ గా తీసి పోస్ట్ చేసారు. ఆ తర్వాత మహేష్ రాముడి అవతారంలో ఉన్న ఫోటో లీక్ అయ్యింది.
వీటన్నిటికీ మించి రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిచయం చేద్దామనుకున్న సినిమా టైటిల్ & గ్లింప్స్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ప్రొజెక్షన్ టెస్ట్ నుండి ఏకంగా డ్రోన్ కెమెరాలతో క్యాప్చుర్ చేసి మరీ లీక్ చేశారు. ఆరోజు స్టేజ్ మీద జక్కన్న కన్నీటి పర్యంతమవ్వడం అందరం చూసాం.
మరి రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో మొదలవ్వనున్న షెడ్యూల్ విషయంలో జక్కన్న ఎలాంటి కేర్ తీసుకుంటాడు? ఇకనైనా లీకులు రాకుండా ఉంటాయా? అనేది చూడాలి. లీకులు ఈ తరహా భారీ సినిమాలకి కామన్ అయినప్పటికీ.. ఇప్పటికే మోతాదుకు మించిన లీకులు జరిగాయి ఈ సినిమాకి.
Aditi Budhathoki turns golden hour into her personal fashion spotlight with a white lace dress…
Don 3 was in the headlines a few months ago after Ranveer Singh left the…