Telugu

బిగ్ బాస్ లో ఆ భార్యాభర్తలు…

తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఇంకా మొదలు కాకముందే వార్తలలో నిలుస్తుంది ఈ షో గురించి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వార్త‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి హోస్ట్ ఎవ‌రనే ప్రశ్నలకు తెరతీస్తూ నాగార్జున అని కన్ఫర్మ్ చేసారు. ఈ మద్యే విడుదలైన ప్రోమో కూడా దుమ్ము దులిపేస్తుంది. ఇక ఇప్పుడు అందరి ఆసక్తి కంటెస్టెంట్లపై ఉంది. ఈ సారి హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఇప్పటికే అనేక పేర్లు బయటకు వచ్చాయి అయితే అందులో చాలా మంది ఇప్పటికే ఖండించారు.

మరోవైపు ఇప్పుడు రెండు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. నిజజీవిత భార్యాభర్తలు వరుణ్ సందేశ్, వితిక సేరు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని సమాచారం. ఇప్పటిదాకా తెలుగులో భార్యాభర్తలు ఎవరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళలేదు. వరుణ్ సందేశ్, వితిక సేరు ఇద్దరూ సినిమా నటులే. అయితే ఇప్పుడు వారిద్దరి చేతిలోనూ సినిమాలు లేవు. జులై చివర్లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది. 100 రోజుల పాటు జరగబోయే ఈ షోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి.

ADVERTISEMENT

మొదటి రెండు సీజన్‌లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. తమిళ, హిందీ బిగ్ బాస్ షోలకు అన్ని సీజన్‌లకు ఒకే హోస్ట్ ఉండగా తెలుగుకు మాత్రం మూడు సీజన్‌లకు ముగ్గురు అయ్యారు ఇప్పటికి. ఇప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, నానిలకు ఇంతకు ముందు టీవీలో చేసిన అనుభవం లేకపోగా… నాగార్జున మాత్రం ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ అనిపించుకున్నారు. మరి ఆయన బిగ్ బాస్ లో చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

భోగాపురం విమానాశ్రయంలో మరో ప్రారంభోత్సవం!

భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…

32 minutes ago

AP MPTC, ZPTC Polls: 46,045 MPTC Nominations Valid

The Andhra Pradesh MPTC and ZPTC election process has entered the next stage, with reports…

1 hour ago