
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన “టెంపర్” సినిమా ఓవరాల్ గా 40 కోట్ల క్లబ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్ ను ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న “ఫిదా” వెనక్కి నెట్టిందనేది ట్రేడ్ వర్గాల లేటెస్ట్ న్యూస్. ఏపీ, తెలంగాణాలతో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్ము దులుపుతున్న ‘ఫిదా’ ఏకంగా వరుణ్ తేజ్ ను 2 మిలియన్ క్లబ్ లో నిలబెట్టనుంది. మెగా హీరోలలో చిరు తర్వాత 2 మిలియన్ క్లబ్ లో చేరనున్న హీరోగా వరుణ్ నిలవనున్నాడు.
అయితే “ఫిదా” ద్వారా వచ్చిన మార్కెట్ ను వరుణ్ ఎలా కన్వేర్ట్ చేసుకుంటారు అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే… ‘ఫిదా’ సినిమాలో హీరో వరుణ్ అయినా… అది విడుదలైంది శేఖర్ కమ్ముల బ్రాండ్ సినిమాగా! అలాగే సినిమా విజయంలో సింహభాగం హీరోయిన్ సాయిపల్లవికి వెళ్లిపోయింది. అలాగే ఇంత ప్రజాధరణ పొందడానికి నిర్మాత దిల్ రాజు ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా వరుణ్ కంటే హైలైట్ అయిన అంశాలు మూడు ఉండడంతో, వరుణ్ అసలు రేంజ్ ఏంటన్నది తదుపరి సినిమాల ద్వారా తెలియనుంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…