
[m9ad]
ఇదిలా ఉంటే మరో పక్క ఈ హీరో వరుసగా అంతరిక్షం, ఎఫ్2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాన్న తరుణంలో వరుణ్ ను విలన్ గా చేసే సరికొత్త ప్రయోగం ఒకటి మెగా వీరాభిమాని అయిన హరీష్ శంకర్ తెరపైకి తెస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమిళంలో భారీ హిట్ అయిన ‘జిగరదండని’ సినిమాలో బాబీ సింహ చేసిన విలన్ పాత్రలో వరుణ్ అయితే బావుంటాడు అని, హరీష్ శంకర్ ఈ కధను వరుణ్ కి చెప్పగా, పాత్ర నచ్చి వరుణ్ సరే అన్నట్లుగా కూడా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నిజంగా వరుణ్ ఈ పాత్ర చేస్తే మాత్రం మెగా ఫ్యామిలీలో ఇది ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. కరియర్ తొలి నాళ్ళలో అవకాశాల కోసం మెగాస్టార్ చిరు చేసిన విలన్ పాత్రలను ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీలో ఏ హీరో చెయ్యలేదు (నాగ బాబు మినహా…అంటే నాగబాబు హీరో పాత్రలు పెద్దగా చెయ్యలేదు అనుకోండి).ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరోల్లో.
అయితే ఇప్పుడు వరుణ్ ఈ పాత్ర చేస్తే మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి విలన్స్ కూడా పుట్టుకొస్తారు అని అదో కొత్త ట్రెండ్ అవుతుంది అని ఆశించవచ్చు. మరి వరుణ్ ఈ రిస్క్ చేస్తాడో, లేక హీరోగానే కరియర్ ను కొనసాగిస్తాడో చూద్దాం.
ఇప్పటికే జగన్ అక్రమాస్తులు, వివేక హత్య కేసులలో ఈడీ విచారణ జోరు పెంచింది. తాజాగా నాడు సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు,…
ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం.…