
మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచమైన మరో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినీ కెరియర్ ప్రయోగాల ఊబిలో చిక్కుకుని బయటపడలేక పోతుంది.
తన మొదటి సినిమా ముకుంద తో 2014 లో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వరుణ్ చేసిన మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ జోలికి పోకుండా ఒక మెచూర్డ్ క్యారెక్టర్ ను ఎంచుకుని మెగా హీరోలలో తానూ వేరయా అంటూ ఒక హింట్ ఇచ్చారు మెగా అభిమానులకు.
అక్కడి నుంచి కంచె అంటూ మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగా ప్రిన్స్ వరుణ్. ఈరెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న విజయాన్ని సాధించనప్పటికీ కంచె మూవీ వరుణ్ కు నటన పరంగా మంచి మార్కులను తెచ్చిపెట్టింది. ఆ తరువాత ప్రయోగాలు పక్కన పెట్టి మాస్ ఇమేజ్ కోసం పూరిని నమ్ముకుని లోఫర్ గా ముందుకొచ్చినా ప్రేక్షకులు ఆ మూవీ ని కూడా లైట్ తీసుకున్నారు.
ఆ తరువాత లావణ్యతో కలిసి వచ్చిన మిస్టర్ ఆయనకు ఒక మిస్సెస్ ను తెచ్చిపెట్టింది కానీ హిట్ ను తేలేకపోయింది. 2017 శేఖర్ కమ్ముల మూవీ అయినా ఫిదా తో హైబ్రిడ్ పిల్లతో కలిసి చేసిన లవ్ స్టోరీతో తన సినీ కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వరుణ్.
ఈ సినిమాలో వరుణ్ – సాయి పల్లవి కెమిస్ట్రీ కి ప్రేక్షకులు మొత్తం ఫిదా అయ్యారు. బాబాయ్ పవన్ సినీ కెరీర్ను మలుపుతిప్పిన తొలిప్రేమ పేరుతో వచ్చి మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా ఫిదా, తొలిప్రేమ రెండు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో విజయం అందుకున్న వరుణ్ తననుంచి ప్రేక్షకులు కోరుకుంటుంది ఏమిటో తెలిసి కూడా మళ్ళీ ప్రయోగాల బాట పట్టారు.
అంతరిక్షం అంటూ వచ్చిన మూవీ అటు అంతరిక్షానికీ తిరిగి సాగనంపారు ప్రేక్షకులు. విడుదలయ్యింది అని తెలిసే లోపే థియేటర్ల నుండి బయటకెళ్ళింది ఈ మూవీ. ఆ తరువాత వచ్చిన గద్దల కొండ గణేష్, వెంకటేష్ తో వచ్చిన మల్టీస్టారర్ f2 తో తన సినీ కెరీర్ గాడిన పడుతుంది అనుకునే లోపే f3 ,ఘని, గాండీవదారి అర్జున తో మరికొన్ని ఫ్లాప్ మూవీస్ ను వెనకేసుకున్నారు వరుణ్.
ఇలా ఇండస్ట్రీలో నిలదోక్కుకోకుండా ప్రయోగాల పేరిట తన కెరీర్ ను రిస్క్ లో పెడుతున్న వరుణ్ మరోసారి ఆపేరేషన్ వాలెంటైన్ అంటూ ఒక పెర్టియాటిక్ మూవీతో ముందుకొచ్చారు. అది కూడా ముందుగా ఊహించినట్టే వరుణ్ ఖాతాలోకి మరో ఫ్లాప్ ను మోసుకొచ్చింది. ఇలా వరుణ్ సినీ కెరియర్ ‘రెండు హిట్లు – నాలుగు ఫ్లాప్’ లతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.
ఇప్పటికైనా తనకు సెట్ అయ్యే కథలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించలేకపోతే వెనుక ‘చిరు’ అనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ‘మెగా’ అనే టాగ్ ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని అల్లు శిరీష్ రుజువు చేసారు. కాబట్టి వరుణ్ ఇక ప్రయోగాల పేరిట చేస్తున్న అర్ధంపర్థం లేని కథలకు సెలవిచ్చి ముందుకు సాగాలి. ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ప్రయోగాలకన్నా ఫలితాలే ముఖ్యమని గ్రహించాలి.
Booking an H-1B visa appointment has become increasingly difficult for Indian applicants. Many users say…
In the 24th match of IPL 2026 at the Wankhede Stadium, Punjab Kings continued their…