Telugu

వరుణ్ పంచ్ @బన్నీ!

వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఫిదా” ఆడియో వేడుక కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో వేచిచూసారు. సోమవారం నాడు ఉదయం దిల్ రాజు ఆఫీసు వద్ద జరిగిన నాటకీయ పరిణామాల నేపధ్యంలో… ‘ఫిదా’ ఆడియో వేడుకలో దీని గురించి మాట్లాడతానని దిల్ రాజు మెగా ఫ్యాన్స్ కు హామీ ఇవ్వడంతో… అందరి దృష్టి దిల్ రాజు ప్రసంగంపై పడింది. దీంతో మెగాస్టార్ చిరంజీవిని కీర్తిస్తూ ప్రసంగం చేయడం దిల్ రాజుకు అనివార్యం అయ్యింది.

మెగా హీరో సినీ వేడుక జరుగుతోంది అంటే చిరంజీవి పేరు చెప్పకుండా ముగించడం అసాధ్యమని, ఒక్క మెగాస్టార్ వలనే ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్… ఇలా ఎంతోమంది హీరోలు వచ్చారని, కనుక మెగాస్టార్ పేరు లేకుండా మెగా హీరోల సినీ వేడుకలు జరగవని మెగా ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచే వ్యాఖ్యలు చేసారు. ఇక మెగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్న ‘డీజే’ కలెక్షన్స్ విషయంపై కూడా స్పందించారు గానీ, ఏ మాత్రం స్పష్టత లేకుండా ముగించారు.

ADVERTISEMENT

ఇటీవల సోషల్ మీడియాలో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కలెక్షన్స్ ‘డీజే’ సినిమా రెవిన్యూను ముడిపెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఎంతమంది హీరోలు వచ్చిన మెగాస్టార్ స్థాయిని తాకలేరని దిల్ రాజు చెప్పారు. అయితే మెగా ఫ్యాన్స్ ఎదురుచూసిన వ్యాఖ్యం మాత్రం దిల్ రాజు నోట నుండి రాలేదు. ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్స్ ను ‘డీజే’ దాటేసింది అన్న టాక్ కు ఓ స్పష్టమైన ప్రకటన వస్తుందని భావించగా, ఆ దిశగా ఎలాంటి ప్రకటన రాలేదు గానీ, మెగాస్టార్ ను కీర్తిస్తూ కావాల్సినన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి.

దిల్ రాజు ఒక్కరే కాదు, హీరో వరుణ్ తేజ్ ప్రసంగం కూడా మెగాస్టార్ చిరంజీవిని పొడుగుతూనే సాగింది. అయితే అందులో వాస్తవం లేకపోలేదు. మెగాస్టార్ తర్వాత తనకు పవన్ కళ్యాణే ఇష్టమని చెప్పిన వరుణ్, ఈ సందర్భంగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పదే పదే మేం చెప్తున్నా సామాన్య ప్రేక్షకులకు బోరు కొడుతుందేమో గానీ, మేం చేసే వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి గానీ, పవన్ కళ్యాణ్ గురించి గానీ ప్రస్తావించకుండా ఉండలేం… అర్ధం చేసుకోండి అంటూ ఓ విధంగా బన్నీకి భారీ పంచ్ ఇచ్చారని చెప్పవచ్చు.

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పేరును తాను చెప్పను అంటూ భీష్మించుకుని కూర్చున్న బన్నీ వ్యాఖ్యలను సవరించే విధంగా వరుణ్ తేజ్ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే బన్నీ ఇప్పటికే స్టార్ గా ఎదిగిన హీరో కాగా, వరుణ్ తేజ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న హీరో. ఒకవేళ స్టార్ గా ఎదిగిన తర్వాత వరుణ్ కూడా బన్నీ మాదిరి చెప్తారా? అంటే అది ఇప్పుడే చెప్పలేం గానీ, తన పెదనాన్న, బాబాయ్ ల పేర్లు చెప్పకుండా తన వేడుకలైతే ఉండవని స్పష్టం చేసాడు వరుణ్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కొండా సురేఖ స్వరంలో మార్పు…అభ్యర్ధనల నుంచి వార్నింగ్ వరకు

తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…

4 seconds ago

Babar Azam Failed as Captain? ‘Dummy Cap’ Tag Given

Pakistan have made several changes to their Test team during the England series, and former…

31 minutes ago