
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 13న విడుదల కాబోతుంది. అదే రోజు విడుదల కానున్న నాని గ్యాంగ్ లీడర్ తో బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడనున్నది. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. సినిమా విడుదలకు నెలల ముందే సినిమా రెడీ అయిపోతుందట.
ఈ సినిమా మొదలు కాకముందే వివాదాలలో చిక్కుకుంది. గ్యాంగ్స్టర్ మూవీకి వాల్మీకి పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే వార్తల్లోకి ఎక్కింది. ఆ తరవాత ఈ ఆందోళన సద్దుమణిగింది. కొన్ని రోజుల క్రితం షూటింగ్ కోసం అనంతపురం వెళ్తే అక్కడి వాల్మీకి కులస్తులు అడ్డుకున్నారు. దీనితో మెగా అభిమానులు రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ కొంత టెన్షన్ గానే ఉన్నారు.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…