Telugu

“వీరభద్రుడు” సినిమా రివ్యూ: దేవుడి మీద భారం ఎక్కువైంది!

చిత్రం: వీరభద్రుడు

M9 రేటింగ్: 2.25 /5

ADVERTISEMENT

విడుదల తేదీ: మే 15, 2026

తారాగణం: సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ, అనఘ, ఇంద్రాన్స్ తదితరులు

నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
దర్శకత్వం: ఆర్జే బాలాజీ

సంగీతం: సాయి అభ్యంకర్

నిర్మాత: ఎస్.ఆర్.ప్రభు – ఎస్.ఆర్.ప్రకాష్ బాబు

ఛాయాగ్రహణం: జీకే విష్ణు

కూర్పు: ఆర్.కలైవణ్ణన్

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “కరుప్పు”. ఈ చిత్రాన్ని తొలుత తెలుగులోనే అదే పేరుతో రిలీజ్ చేద్దామనుకున్నా.. టైటిల్ విషయంలో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో “వీరభద్రుడు”గా మార్చారు. నిన్న విడుదలవ్వాల్సిన చిత్రం ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ఆగి.. ఇవాళ (మే 15) విడుదలైంది. సూర్యకి కమర్షియల్ హిట్ చాలా అవసరమైన సమయంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!

కథ:

హైదరాబాద్ రైల్వే స్టేషన్లో బంగారు పోగొట్టుకున్న తండ్రీ కూతుర్లు మునుస్వామి నాయుడు (ఇంద్రాన్స్), మీను (అనఘ) పోలీసుల్ని ఆశ్రయిస్తారు. దొంగల మంచితనం కారణంగా బంగారం వెంటనే దొరికినా.. ఆ బంగారం తిరిగి దక్కించుకోవాలంటే లీగల్ గా కోర్ట్ లోనే సాధించుకోవాలి అనే రూల్ కారణంగా.. బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే లాయర్ ను ఆశ్రయిస్తారు. చాలా సింపుల్ కేసును సాగదీసి ఆఖరికి మీను ప్రాణాల మీదకి వచ్చేలా చేస్తాడు బేబీ కృష్ణ.
ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, తన భక్తుల్ని కాపాడుకోవడానికి స్వయంగా ఆ వీరభద్ర స్వామి (సూర్య) లాయర్ సూర్యగా నాంపల్లి కోర్టులోకి ప్రవేశిస్తాడు.
అక్కడి నుండి పరిస్థితిలు ఎలా మారాయి? న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లని దేవుడైనా మార్చగలిగాడా? లేదా? అనేది “వీరభద్రుడు” కథాంశం.

నటీనటుల పనితీరు:

చాలారోజుల తర్వాత సూర్య కొత్తగా కనిపించాడు. మీసకట్టు, హెయిర్ స్టైల్ మొదలుకొని బాడీ లాంగ్వేజ్ వరకు డిఫరెంట్ గా కనిపించాడు. ముఖ్యంగా వీరభద్ర స్వామిగా వీరంగం చేసే సమయంలో సూర్య పెర్ఫార్మెన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అయితే.. సూర్య పాత్ర సినిమా మొదలైన 40 నిమిషాల వరకు కనిపించకపోవడం.. తర్వాత కూడా యాక్షన్ సీన్లు మినహా మిగతా సీన్స్ లో బ్యాగ్రౌండ్ లో ఉండిపోవడం అనేది అభిమానులను సంతృప్తిపరచలేకపోయింది.
సినిమాలో కీలకపాత్ర పోషించిన దర్శకుడు ఆర్జే బాలాజీ.. సినిమాకి మైనస్ అయ్యాడని చెప్పాలి. రైటింగ్ పరంగా ఆ క్యారెక్టర్ లో దమ్మున్నా.. దాన్ని బాలాజీ క్యారీ చేయలేకపోయాడు. బాలాజీ కాకుండా మరే ఇంతర తమిళ లేదా తెలుగు కథానాయకుడు ఈ పాత్ర పోషించినా బాగుండేది. దేవుడితో ఢీకొట్టే స్థాయి ఉన్న పాత్రలో కనిపించాల్సిన తెగువ బాలాజీ కళ్ళల్లో కనిపించలేదు.
త్రిష సినిమాలో పేరుకే హీరోయిన్ కానీ.. క్యారెక్టర్ రోల్ లాంటిది. మార్కెట్ పరంగా ఒక హీరోయిన్ ఉండాలి అన్నట్లుగా పెట్టారు అంతే.
మలయాళ నటుడు ఇంద్రాన్స్ నటన మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది. నిస్సహాయతను ఆయన పండించిన తీరు కట్టిపడేస్తుంది. నవతరం అమ్మాయిగా అనఘ కూడా అలరించింది.

సాంకేతికవర్గం పనితీరు:

“డ్యూడ్” సినిమాతో తన సంగీతంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి అభ్యంకర్.. “వీరభద్రుడు” విషయంలో మాత్రం ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా తెలుగు వెర్షన్ మిక్సింగ్ & లిరిక్స్ కారణంగా బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ వర్కవుట్ అవ్వలేదు. తమిళంలో కాస్త బాగున్న పాటలు కూడా తెలుగులో ఎబ్బెట్టుగా అనిపించాయి.
జీకే విష్ణు సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. సూర్యను దేవుడిగా చూపించే సన్నివేశాల్లో లైటింగ్ అదిరిపోయింది. ఇప్పటివరకు తెరపై చూపించిన దేవుళ్లకి భిన్నంగా సూర్యను ప్రొజెక్ట్ చేయగలిగాడు విష్ణు.
భారీ బడ్జెట్ సినిమా అన్నారు కానీ.. గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉంది. ఎస్.ఎఫ్.ఎక్స్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో చాలా సన్నివేశాల్లో దొరికిపోయారు. ఇంకాస్త కేర్ ఫుల్ గా ఉంటే బాగుండేది.
ప్రొడక్షన్ డిజైన్ లో కూడా లోటుపాట్లు ఉన్నాయి. కోర్టు సెట్ వరకు మ్యానేజ్ చేసారు కానీ.. మిగతా లొకేషన్స్ అన్నీ సెట్స్ & సెటప్స్ అని అర్థమైపోతున్నాయి.
దర్శకుడు ఆర్జే బాలాజీ న్యాయ వ్యవస్థ మీద సంధించిన వ్యంగ్యాస్తం ఈ చిత్రం. ఆఖరికి దేవుడే దిగి వచ్చినా.. న్యాయ వ్యవస్థలోని లోపాల్ని, విధివిధానాల్ని కొంచం కూడా సరిదిద్దలేరు అని వేసిన సెటైరికల్ సినిమా ఇది. అయితే.. పాయింట్ లో ఉన్న దమ్ము, కథనంలో లోపించింది. హీరోకంటే తన పాత్రకి ఎక్కువ ఎలివేషన్స్ రాసుకోవడం, సూర్య కంటే ఎక్కువ ఫ్రేమ్స్ పడడం అనేది ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. దేవుడ్ని సైతం ప్రశ్నించే స్థాయి ఉన్న పాత్ర ఎలా ఉండాలి అనేది రాతలో ఉన్నా.. తీతలో లోపించింది. అందులోనూ సెటైరికల్ డ్రామాలా సాగాల్సిన సినిమాని ఫాంటసీ జోనర్ లోకి లాగడం వల్ల సినిమా యొక్క థీమ్ కి ఆడియన్స్ పూర్తిస్థాయిలో కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇవన్నీ సరిపోవన్నట్లు హాలీవుడ్ ఫిలిమ్స్ “లయర్ లయర్” (1997) మరియు “గార్డియన్స్” (2017)లోని పాపులర్ సీన్స్ ని ఏమాత్రం మొహమాటం లేకుండా కాపీ కొట్టడం అనేది దర్శకుడిగా ఆర్జే బాలాజీ క్రియేటివ్ అప్రోచ్ లో లోపించిన ఒరిజినాలిటీకి నిదర్శనం. అందువల్ల దర్శకుడిగా కానీ, నటుడిగా కానీ ఆర్జీ బాలాజీ ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి.

విశ్లేషణ:

సినిమా జోనర్ ఏంటి? సినిమాలోని కీలకమైన అంశం ఏంటి? అనేది ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చాక నువ్ ఎన్ని జిమ్మిక్కులైనా చేయొచ్చు. కానీ.. జోనర్ & కంటెంట్ క్లారిటీ ఇవ్వకుండా సినిమాని సాగదీయడం వల్ల ప్రేక్షకులకి ఆసక్తి పోతుంది అనే విషయాన్ని ఆర్జే బాలాజీ పూర్తిగా పక్కన పెట్టేశాడు. నిజానికి ఈ సినిమా గతేడాది విడుదలవ్వాలి. ట్రైలర్ రిలీజ్ వరకు సూర్య బ్లాక్ షర్ట్ పోస్టర్స్ తప్ప ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు. సినిమా కంటెంట్ ను ముందుగానే రివీల్ చేసి ఆడియన్స్ ను ప్రిపేర్ చేసి ఉంటే ఏం ఆశించి థియేటర్లకి రావాలో క్లారిటీ ఉంటుంది కాబట్టి.. ఇలా ఫీలై ఉండేవారు కాదు. అన్నిటికీ మించి బలమైన ప్రతినాయకుడు లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. ముందు చెప్పుకున్నట్లుగా.. ఆర్జే బాలాజీ పోషించిన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్య లాంటి నటులెవరైనా పోషించి ఉంటే ఇంకా బాగా వర్కవుట్ అయ్యేది.
అయితే.. సూర్యని దేవుడిగా చూపించే ఎలివేషన్లు, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే దేవుడి ఎపిసోడ్ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది, అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి. కాకపోతే.. సినిమా పూర్తయ్యేసరికి ఇది సెటైరికల్ సినిమా అని అర్థమై తేరుకునేసరికి నీరసిస్తారు ప్రేక్షకులు.

ఓవరాల్ గా.. దేవుడి మీద భారం ఎక్కువైంది!

M9 రేటింగ్: 2.25/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Recent Posts

CBN, Pawan Discuss Seats Ahead of Local Body Polls

AP Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan held a key…

6 minutes ago

AK 47 Postponement Mystery: What Is Trivikram Hiding?

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…

16 minutes ago