
కమీషనర్ లక్ష్మీషా జీవీఎంసీ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంలా మార్చేశారని వెలగపూడి ఆరోపించారు. టిడిపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కమీషనర్ ఏనాడూ ప్రోటోకాల్ పాటించలేదని, ఎందుకంటే ఆయన ఓ అధికారిగా కాకుండా వైసీపీ నేతలాగ ఫీల్ అవుతూ వారితో అంటకాగుతున్నారని వెలగపూడి రామకృష్ణ ఆరోపించారు.
ఇందుకు తాజా ఉదాహరణగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకి జీవీఎంసీ కార్యాలయంలో కాఫీ విత్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ), వైసీపీ ఎంపీ డాక్టర్ సత్యవతి (అనకాపల్లి), వైసీపీ ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు (భీమిలి), తిప్పల నాగిరెడ్డి (గాజువాక), వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కళ్యాణిలను మాత్రమే ఆహ్వానించారు.
విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు వెలగపూరి రామకృష్ణ, గణబాబు, గంటా శ్రీనివాసరావులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అలాగే బిజెపి ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్ను కూడా ఆహ్వానించకుండా వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోనే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసమస్యలపై సంబందిత శాఖల అధికారులతో ప్రజాప్రతినిధులు ముఖాముఖి నిర్వహించాలనుకొన్నప్పుడు, తమను ఎందుకు ఆహ్వానించలేదని వెలగపూడి ప్రశ్నించారు. నగరంలో వైసీపీకి చెందినవారిని మాత్రమే లక్ష్మీషా ప్రజాప్రతినిధులుగా గుర్తిస్తున్నారు కనుక ఆయన తన కమీషనర్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోతే బాగుంటుందని టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేసారు.
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…
Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…