
దానితో అసురన్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ను ఫైనల్ చెయ్యడం పెద్ద ఇబ్బందిగా మారిందట. అవార్డు విన్నింగ్ సినిమాల దర్శకుడు వెట్రి మారన్ తీసిన తమిళ చిత్రం అది. ఆయన రేంజిలో తీయాలంటే కష్టమే. ఆయననే ఈ సినిమాకు తీసుకోవాలని అనుకున్నా అందుకు ఆయన నో చెప్పారట.
భాష ఇబ్బంది వల్ల ఈ సినిమా నేను చెయ్యలేను అని ఆయన చెప్పేశారట. దీనితో ఇటీవల రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఒక 20 మంది యువ దర్శకులకి షో వేశారు. సినిమా చూసి యాజిటీజ్ గా రీమేక్ చెయ్యగలమని ఎవరు ముందుకు వస్తే వారికి బాధ్యత అప్పగించాలని ప్లాన్ చేసారు. మొన్న అందరు చూశారు. సురేష్ బాబు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.
వెంకటేష్ నటించిన వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే సినిమా రిలీజ్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించలేదు. మొదట్లో సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరిగినా డిసెంబర్ లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
The shooting of actor Sivakarthikeyan's Seyon directed by Sivakumar Murugesan and produced by Kamal Haasan's…
Vijay Deverakonda's films continue to grab attention, but turning that attention into box-office success has…