
అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ అతిథి పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా తళుక్కుమనబోతున్నాడన్న విషయం ఖరారైంది. ఈ రోజు నుండే షూటింగ్ లో పాల్గొంటున్న విక్టరీ – పవర్ స్టార్ కాంభినేషన్… ఈ సారైనా ఫ్యాన్స్ ఆకలి తీర్చే విధంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లోకి వెంకీ జత కాగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
వెంకటేష్ చేసేది గెస్ట్ రోల్ అయినా… వీరిద్దరి కాంభినేషన్లోనే సీన్లు ఉన్నాయన్న సమాచారం ఫ్యాన్స్ ను నూతన ఉత్సాహంలో నింపుతోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ కావడంతో… ఈ సారి మాత్రం సీన్లు అదిరిపోవాలి… ధియేటర్లు దద్దరిల్లిపోవాలి… అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి అభిమానులు ఆశించే అంశాలు సినిమాలో ఉంటాయా? ఉండవా? అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
Hardik Pandya could leave Mumbai Indians ahead of IPL 2027, with Punjab Kings reportedly close…
Dia Mirza's latest controversy began with a simple appeal for a pollution-free Diwali. But what…