
ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రీ మామ అల్లుళ్ళ సంబంధం గురించి రాసిన లిరిక్స్ కూడా ఆకట్టుకునే ఉన్నాయి. శ్రీకృష్ణ బాగా పాడాడు అనే చెప్పుకోవాలి. మొత్తానికి సినిమా ప్రమోషన్స్ కు ఈ పాట మంచి స్టార్ట్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే వెంకీ మామ విడుదల తేదీ గురించి నిర్మాతలు ఇప్పటికి కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
మొదట్లో సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరిగినా డిసెంబర్ లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. వెంకీ మామ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్యలను పూర్తి స్థాయి పాత్రలలో అభిమానులు చూడబోతున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎఫ్2 తో వెంకటేష్, మజిలీతో నాగచైతన్య మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ చిత్రంతో దానిని కొనసాగించాలని అనుకుంటున్నారు.
అవును. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాట చెప్పారు. నేడు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో మాట్లాడుతూ,…
After The Raja Saab, Prabhas reportedly promised People Media Factory another film. Now, the production…