Telugu

పవన్ కే కాదు, వెంకీకి కూడా అదే హంగామా!

అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో లేదంటే ఆడియో వేడుకలు జరగనున్న సమయంలో అభిమానులు చేసే హంగామాకు కొదవుండదు. అయితే అందరి హీరోల అభిమానుల కంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త సందడి ఎక్కువన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన టీ షర్టులు, హ్యాండ్ కర్చీఫ్ లు, రిస్ట్ బ్యాండ్ లు, హెడ్ బ్యాండ్ లు… ఇలా ఒకటేమిటిలే… పవన్ కళ్యాణ్ అభిమానులు చూపించే ఉత్సాహం పండగ వాతావరణాన్ని తలపిస్తాయి.

పవన్ ఫ్యాన్స్ తర్వాత ఇటీవల కాలంలో ప్రిన్స్ అభిమానులు కూడా కాస్త హంగామా ఎక్కువే చేస్తున్నారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ అభిమానులు కూడా తామేం తక్కువ కాదని నిరూపించుకునే క్రమంలో ఉన్నారు. ‘బాబు బంగారం’ ఆడియో విడుదల నేపధ్యంలో వెంకటేష్ స్టిల్స్ తో కూడిన టీ షర్టులు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో విక్టరీ లుక్స్ అద్భుతంగా కనపడుతుండడంతో, విజయం పట్ల విక్టరీ ఫ్యాన్స్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ADVERTISEMENT

ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమవ్వడంతో సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా ఆడియో జూలై 9వ తేదీన విడుదల కానుండగా, సినిమాను జూలై 29వ తేదీన విడుదల చేయబోతున్నారు. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mirzapur BO Day 2: Star Power Finally Dead in Bollywood?

Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…

24 minutes ago

H-1B Employer Fights Workers Over Unpaid Salaries

A video shot in an unknown office in Dallas, Texas has gone viral, and has…

44 minutes ago