
కానీ షాకింగ్ విషయం ఏమిటంటే…158 నిముషాలు కలిగిన సినిమాలో, ఒక్క సన్నివేశంలో కూడా వెంకటేష్ కనిపించకపోవడం..! నిజానికి వెంకీ ఉండాల్సిన ఆవశ్యకత ఈ కధలో లేదు, అలాగే ఒరిజినల్ ‘లార్గో వించ్’లో కూడా అలా లేదు. అయినా ఒరిజినల్ కధతో పనేముంది, ఎలాగూ ఫ్రీమేక్ కాబట్టి, ఏదొక సన్నివేశంలో వెంకటేష్ కనిపిస్తారని భావించిన ప్రేక్షకులకు, త్రివిక్రమ్ “అజ్ఞాతవాసి” అనే టైటిల్ కు సార్ధకత చేకూర్చారు. దీంతో సినిమాలో అసలు “అజ్ఞాతవాసి” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకుండా, విక్టరీ వెంకటేష్ గా మారారు.
మరి ఏ విధంగా దోహదం చేసారని సినిమా ఫస్ట్ షాట్ లోనే ‘సిన్సియర్ థాంక్స్ టు వెంకటేష్’ అని వేసారో అర్ధం కాని పరిస్థితి ప్రేక్షకుల వంతయ్యింది. బహుశా ఎడిటింగ్ లో వెంకటేష్ పై చిత్రీకరించిన సన్నివేశాలు కత్తిరించారో లేక తెరపై కనిపించని విధంగా మరో రకంగా ఏమైనా సహాయం చేసారో గానీ, సినిమా మాదిరే ఆ ఫస్ట్ షాట్ కు న్యాయం చేయలేకపోయారు త్రివిక్రమ్. ఓవరాల్ గా సినిమాను సంతృప్తి పరచలేకపోయిన ‘మాటల మాంత్రికుడు,’ కనీసం వెంకీనైనా కాసేపు చూపిస్తే… వీక్షకులకు ఊరట కలిగేదేమో!
Yash’s Toxic has been getting mixed reactions since its release, but the actor is finding…
The YSR Congress top leadership is absolutely rattled by the recent developments concerning Vijaya Sai…