
ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే, తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ న్యూ లుక్ పై సర్వత్రా ‘పాజిటివ్’ టాక్ రావడంతో ‘జనతా గ్యారేజ్’పై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. ‘నాన్నకు ప్రేమతో’ వంటి విభిన్నమైన సినిమా తర్వాత జూనియర్ నటిస్తున్న సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడతాయి, అయితే వాటిని మరింత రెట్టింపు చేసే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో సందడి చేసాయి.
అందులోనూ మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు అదనపు ఆకర్షణలు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘మిర్చి, శ్రీమంతుడు’ సినిమాల తర్వాత కొరటాల – దేవి కాంభినేషన్లో ‘హ్యాట్రిక్’ మూవీగా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ‘జనతా గ్యారేజ్.’
#AK47: Familiar, Fun First Half Familiar family fun with Venky in his element. His natural…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…