
ఈ బ్రేక్ కు ప్రత్యేక కారణాలేవీ లేవు. కేవలం రాజకీయ పరమైన ఇబ్బందుల రీత్యా బిజెపి నేతల అక్కసుతోనే రిలీజ్ కు బ్రేక్ పడినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. జీఎస్టీపై హీరో విజయ్ వేసిన డైలాగ్ ల నేపధ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బిజెపి నేతలు, ఈ సినిమా రిలీజ్ కు బ్రేకులు వేసినట్లుగా సమాచారం. బహుశా వచ్చే వారంలో మళ్ళీ విడుదలకు సన్నాహాలు చేయవచ్చు.
గత వారం తమిళంలో విడుదలైన ఈ సినిమాకు భిన్న స్పందనలు వచ్చినప్పటికీ, వివాదం నేపధ్యంలో తలెత్తిన పబ్లిసిటీ సినిమాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీంతో కోలీవుడ్ లో బంపర్ కలెక్షన్స్ ను ‘మెర్సల్’ సొంతం చేసుకుంది. అదే ఊపులో తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకోవాలన్న విజయ్ కలను బిజెపి నేతలు తాత్కాలికంగా అయితే బ్రేకులు వేయగలిగారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…