
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణం. అయితే.. పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు మాత్రం చాలా అరుదు. ఒక ఎంజియార్, ఎన్టీఆర్ తర్వాత విజయ్ కి మాత్రమే అది సాధ్యపడింది. అయితే.. ముఖ్యమంత్రులు అయ్యాక కూడా ఎంజీఆర్, ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో నటించారు కానీ.. టైటిల్ కార్డ్ లో ఎక్కడా, ఎప్పుడూ ముఖ్యమంత్రి అని వేయించుకోలేదు.
ఈ అరుదైన రికార్డ్ విజయ్ సొంతం కానుంది. ఎలక్షన్స్ ముందు పలు కారణాల వల్ల విడుదల కాలేకపోయినా “జన నాయగన్”, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిలీజ్ కి సిద్ధమవుతోంది. అప్పటికి సెన్సార్ & ఓటీటీ పనులన్నీ అయిపోతాయి.
ఇకపోతే.. ఈ సినిమాకి ఒక స్పెషల్ టైటిల్ కార్డ్ డిజైన్ చేయాలని విజయ్ అభిమానుల నుండి గట్టి రిక్వెస్ట్ ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అని వచ్చేలా ఆ టైటిల్ కార్డ్ ఉండాలని వారి ఆకాంక్ష. టైటిల్ కార్డ్స్ విషయంలో ఒక ట్రెండ్ సృష్టించిన వ్యక్తి విజయ్. అతడి లియో టైటిల్ కార్డ్ ని ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు.
అందువల్ల.. దర్శకుడు హెచ్ వినోద్ గనుక అభిమానుల కోరికను మన్నించి ఆ టైటిల్ కార్డ్ ను డిజైన్ చేయించగలిగితే, ప్రపంచ సినిమా చరిత్రలో “ముఖ్యమంత్రి” అనే టైటిల్ కార్డ్ తన సినిమాకి వేయించుకున్న ఏకైక వ్యక్తిగా విజయ్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడు. మరి ఇది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.
ఒకవేళ విజయ్ మొహమాటానికి వద్దు అని చెప్పినా.. అభిమానులే ఆ టైటిల్ కార్డ్ తయారు చేయించి, సినిమాకి ముందు యాడ్ లా అన్నీ థియేటర్లలో ప్రదర్శించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
https://twitter.com/JDALEXtweets/status/2051919993902911655?ref_src=twsrc%5Etfw
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…