Telugu

విజయ్ దేవరకొండలో ఈ కన్ఫ్యూషన్ ఏంటి?

విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా మొన్న ఆ మధ్య టైటిల్ అనౌన్స్మెంట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సంవత్సరాంతం లోనే విడుదల అవుతుందని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇక ఈ సంవత్సరం సరైన రిలీజ్ డేట్లు లేకపోవడంతో సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు సమాచారం.

అది కూడా 2020 ఫిబ్రవరికి… ఇంకా చాలా టైం ఉండటంతో ప్రస్తుతానికి సినిమా షూటింగ్ కూడా ఆపేశారట. రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చాకే మిగతా భాగం పూర్తి చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో విజయ్ అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ADVERTISEMENT

దేవరకొండ చివరి సినిమా డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీనితో ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు. క్రాంతి మాధవ్ కూడా ఉంగరాల రాంబాబు అంటూ తన మీద ఇంప్రెషన్ కూడా చెడిపోయే రేంజ్ సినిమా ఒకటి తీసాడు. దానితో ఆయనకు కూడా ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం.

ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఆ సినిమా కూడా మొన్న ఆ మధ్య హీరో సినిమాను కూడా ఏవో స్క్రిప్ట్ సమస్యలు అని మధ్యలో ఆపేశాడు విజయ్. మరి హీరోలో ఈ కన్ఫ్యూషన్ ఏంటో అర్ధం కాదు. మరోవైపు జనవరిలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా మొదలు పెట్టబోతున్నాడు విజయ్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varam Review: A Quirky, Low-Stakes Fantasy

BOTTOM LINE A Quirky, Low-Stakes Fantasy PLATFORM JioHotstar RUNTIME 1 Hour What Is the Show…

8 minutes ago

Bunny Vas Has a Strong Message for AI Trolls

Producer Bunny Vas has a message for youngsters who are trolling the use of Artificial…

52 minutes ago