Telugu

శ్యామ్… ఇలా చెప్పకు… వేరే హీరో ఫ్యాన్స్ ఫీలవుతారు..!

సావిత్రి జీవితకధ ఆధారంగా తెరకెక్కిన “మహానటి” ఆడియో వైభవంగా విడుదలైంది. ఈ వేదికపై మరోసారి తనదైన మార్క్ ప్రసంగంతో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో అయినా నటించినందుకు గర్వంగా ఉందని చెప్పిన విజయ్, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో తాను స్క్రీన్ షేర్ చేసుకున్నట్లుగా తెలిపారు.

ADVERTISEMENT

శ్యామ్ తో షూటింగ్ అంటే ఎప్పుడూ సరదాగా ఉంటుందని, మేకింగ్ వీడియోలలో మీరు చూసినా, ఎప్పుడూ ఇద్దరం నవ్వుతూ సరదాగానే కనపడుతుంటామని అన్నారు. ‘నా బెస్ట్ కో స్టార్ నువ్వని శ్యామ్ ఎప్పుడూ చెప్తూ ఉంటుందని… ఇలా చెప్పకు, వేరే హీరోల ఫ్యాన్స్ ఫీల్ అవుతారని తాను చెప్పినా, ఎవరూ ఎలా ఫీల్ అయినా యు ఆర్ ది బెస్ట్’ అని శ్యామ్ చెప్పిందని విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆడిటోరియంలో నవ్వులు పూయించాయి.

ఈ సందర్భంలో తారక్ – సమంతలు ఏదో మాట్లాడుతుండగా, ‘తారక్ భయ్యా నా కాలు లాగడానికి ఏదో ప్రయత్నిస్తున్నట్లున్నాడు’ అని చెప్పగానే, ‘అలాంటిదేమీ లేదు’ అన్నట్లుగా సైగ చేసాడు జూనియర్. ‘నువ్వు కూడా నా బెస్ట్ కో స్టార్’ అంటూ సమంతకు కితాబిస్తూ… ముక్కుసూటిగా మాట్లాడుతూ యంగ్ తరంగ్ ను ఆకర్షిస్తోన్న విజయ్ దేవరకొండ, “మహానటి” ఆడియో వేడుకలోనూ తనదైన మార్క్ ప్రసంగంతో హైలైట్ అయ్యారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Anand, Vijay, Rashmika: Deverakonda Family Battle Begins

The last quarter of 2026 is turning into an interesting period for the Deverakonda family.…

14 minutes ago

ఇచ్చట అన్ని చేదు నిజాలే చెప్పబడును: కవిత

భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…

36 minutes ago