
Vijay Deverakonda and DC Movie Debate
లోకేష్ కనగరాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన డిసి అనే తమిళ చిత్రం తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ సినిమాని విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్నాడని, విజయ్ చేసి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేదని విజయ్ ఫ్యాన్స్ అండ్ కామన్ తెలుగు ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. విజయ్ పాత ఇంటర్వ్యూ స్టేట్మెంట్ ఒకటి ఆ డిస్కషన్ వైరల్ అవ్వడానికి ముఖ్యకారణంగా మారింది.
కాకపోతే.. నిజంగా విజయ్ చేసి ఉంటే డిసి ఇదే స్థాయి విజయం సాధించేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఎందుకంటే.. డిసి సినిమాలో లోకేష్ కనగరాజ్ ఎక్కడా ఒక హీరోలా కనిపించడు. ఒక క్యారెక్టర్ లా మాత్రమే కనిపిస్తుంటాడు. అతడి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అన్నీ అతడ్ని డామినేట్ చేస్తుంటారు.
విజయ్ నుండి అదే స్థాయి స్పోర్టివ్ క్యారెక్టర్ ఎక్స్ పెక్ట్ చేయగలమా? హీరోయిజం అని, ఇంట్రడక్షన్ సీన్ అనీ, స్పెషల్ సాంగ్ అనీ ఎన్ని ఇరికించేవారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ కాంబినేషన్ డిసిలో ఇప్పుడు ఉన్నంత సింపుల్ గా ఉండేదా?. ఇలా బోలెడన్ని ప్రశ్నలున్నాయి.
ఇకపోతే.. విజయ్ కి రౌడీ జనార్ధన డిసి రేంజ్ సినిమా అవుతుందని విజయ్ అభిమానులు ఆశ పడుతున్నారు. కానీ.. సన్ పిక్కర్స్ రేంజ్ క్వాలిటీ దిల్ రాజు నుండి ఆశించగలమా? మలయాళ సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్ “డిసి”లో అనిరుధ్ మ్యూజిక్ కి మ్యాచ్ చేయగల అవుట్ పుట్ ఇవ్వగలడా? అనేది కూడా ఆలోచించాలి.
ఇప్పుడు రణబాలి సెప్టెంబర్ రేస్ నుండి తప్పుకోవడంతో.. అదెప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. ఇక రౌడీ జనార్ధన ఎప్పటికీ రిలీజ్ అవ్వాలి? విజయ్ కమ్ బ్యాక్ ఏ సినిమాతో వస్తుంది? అనేది ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…