Telugu

స్టార్స్ ని ఎడా పెడా వాడేస్తున్న నిర్మాతలు

ఒక చిన్న సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఎవరో ఒక స్టార్ దాన్ని ప్రమోట్ చేయాల్సిందే. మీడియం బడ్జెట్ సినిమాలకు ఇది వర్తిస్తుంది. అందుకే ఇప్పుడు తమ ప్రొడక్షన్ లో చేస్తున్న మీడియం బడ్జెట్ సినిమాలకు తమ నిర్మాణంలో సినిమాలు చేస్తున్న స్టార్స్ సపోర్ట్ తీసుకుంటూ ఫ్రీ పబ్లిసిటీ అందుకుంటున్నారు నిర్మాతలు. నిజానికి ఒక పెద్ద ప్రొడక్షన్ లో చిన్న సినిమా అంటే అంతో ఇంతో బజ్ ఉంటుంది. కానీ దానికి స్టార్స్ సపోర్ట్ దక్కితే కాస్త క్రేజ్ వస్తుంది. సరిగ్గా ఇదే ఆలోచించి తమ సినిమాలకు స్టార్ల సపోర్ట్ తీసుకొని సినిమాలను మార్కెటింగ్ చేసుకుంటున్నారు బడా నిర్మాతలు.

తాజాగా పూరి జగన్నాథ్ , నాగ వంశీ అదే ఫాలో అయ్యారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ లో పవన్ కళ్యాణ్ -రానా లతో భీమ్లా నాయక్ అనే సినిమా తెరకెక్కుతుంది. అదే బేనర్ లో నాగ శౌర్య హీరోగా ‘వరుడు కావలెను’ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా ఈవెంట్ కోసం తమ బేనర్ లో సినిమా చేస్తున్న రానా ని గెస్ట్ గా ఆహ్వానించారు నిర్మాత. అలాగే రేపు పూజా హెగ్డే గెస్ట్ గా మరో ఈవెంట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. పూజతో ‘అరవింద సమేత’ , ‘అల వైకుంఠ పురములో’ సినిమాలు తీశాడు నిర్మాత. అందుకే ఈవెంట్ కి పూజ గెస్ట్ గా మారింది. ఇక పూరి కథ -స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ తన కొడుకు ఆకాష్ తో ‘రొమాంటిక్ ‘ అనే సినిమా నిర్మిస్తున్నాడు. దాని ప్రచారం కోసం తనతో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ని బరిలోకి దింపారు.

ADVERTISEMENT

గతంలో సుకుమార్ ఇదే చేశాడు. తన బేనర్ లో చేసిన ‘కుమారి 21F’సినిమా ప్రమోషన్ కోసం తనతో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ గెస్ట్ గా ఈవెంట్ చేశాడు. అలాగే మిగతా హీరోలని కూడా ఆ సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఇప్పుడు పూరి మిగతా బడా నిర్మాతలు కూడా అదే ఫాలో అవుతున్నారు. కొన్ని రోజులకి సినిమా సైన్ చేసే ముందే తమ బేనర్ లో చేయబోయే మరో సినిమాకు ప్రమోషన్ చేసిపెట్టాలని ముందుగా అగ్రిమెంట్ చేయించుకుంటారేమో ?

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Team India’s Weakness: Will NZ Tour Expose It Further?

India's 2-2 T20I series draw against the West Indies has exposed a concern that the…

25 minutes ago

Reality Dasara Special: A Family Celebration

Kiran Abbavaram is gearing up for the holiday season with his upcoming family entertainer, Reality.…

53 minutes ago