
[m9ad]
నిజానికి ఈ వార్తలు ‘గీత గోవిందం’ సమయంలోనే రాగా, ఆ సినిమా హంగామాలో ‘టాక్సీవాలా’ ఇష్యూ వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తోన్న విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చే విధంగా మళ్ళీ ‘టాక్సీవాలా’ తెరపైకి వచ్చింది. రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ పేర్లతో గల జీ మెయిల్ ఎకౌంటులకు సంబంధించిన గూగుల్ డ్రైవ్ ల ద్వారా ఈ సినిమా షేర్ అవుతున్నట్లుగా గుర్తించారు.
అంతేగాక సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ల వేదికగా ఈ మూవీని అప్ లోడ్ చేసినట్లుగా ఎలుస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్ట్ లు జరిగినా… ఈ లీకేజ్ వీరులు మాత్రం వెనక్కి తగ్గకపోతుండడం సినీ పరిశ్రమకు ఇబ్బందికరంగా మారుతోంది. విడుదలకు ముందే లీక్ అయిన ‘టాక్సీవాలా’ కూడా మరో సెన్సేషనల్ హిట్ గా నిలుస్తుందా?!
Mythri Movie Makers has been supporting new talent through content-driven films. The production house has…
Abhishek Sharma is back at the top of the ICC T20I batting rankings, but there…