Telugu

US: అప్పుడూ…ఇప్పుడూ “దేవరకొండనే”

టాలీవుడ్ సినిమాలకు గత కొంత కాలంగా ఓవెర్సీస్ కలెక్షన్స్ ప్రాణంగా మారాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వారి తీర్పుపై ఆధారపడి అనేక సినిమాలు తమ పట్టును నిలుపుకున్నాయి. అయితే ఈ క్రమంలో బడా హీరోల నుంచీ చిన్న హీరోల వరకూ ఈ కలెక్షన్స్ లెక్క భారీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓవెర్సీస్ లో రిలీజ్ అయిన సినిమాల విషయమే తీసుకుంటే విజయ్ దేవరకొండ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

[m9ad]

ADVERTISEMENT

దానికి గల కారణాలు ఏంటి అంటే, తాజాగా రిలీజ్ అయిన సినిమా లెక్కలు తీసుకుంటే ఓవెర్సీస్ బయ్యర్స్ అప్పుడు విజయ్ “గీతా గోవిందం”తో మంచి లాభాలు రాబట్టగా, ఇప్పుడు మళ్లీ అదే హీరో సినిమా ట్యాక్సీ వాలాతో సేఫ్ జోన్ లోకి వెళ్లారు. అయితే మధ్యలో బడా హీరోల నుంచి బుల్లి హీరోల సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ, సినిమా కొనుక్కున బయ్యర్స్ కి మాత్రం లాభాల రుచిని ఆస్వాదించే అవకాశం పెద్దగా దక్కలేదు అనే చెప్పాలి. ఇక విజయ్ ట్యాక్సీ వాలా మాత్రం సినిమా రిలీజ్ అయ్యి ఆ వీకెండ్ గడవకుండానే బ్రేక్ ఈవన్ ను దాటి ఈ సినిమా బయ్యర్స్ ని సేఫ్ జోన్ లో పడేసింది. అయితే ఈ సినిమా కన్నా ఒకరోజు ముందు రిలీజ్ అయిన మాస్ మహారాజా రవితేజ “అమర్-అక్బర్-అంతోనీ” అయితే డిజాష్టర్ గా నిలిచి సినిమా కొన్న వాళ్ళకి కన్నీళ్లనే మిగిల్చింది. ఆ సినిమా మొత్తంగా $108K మాత్రమే వసూలు చేసి అటు ఫాన్స్ నే కాకుండా ఇటు ట్రేడ్ ని కూడా భారీగానే నిరాశ పరిచింది. అయితే మరో పక్క ఒక్క నోటా కాస్త నిరాశ పరిచినా ఆ సినిమా మినహా విజయ్ చేసిన సినిమాలు అన్నీ ఓవెర్సీస్ బయ్యర్స్ కి మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి.

ఇక ట్యాక్సీ వాలా జోరు మంచి ఊపు మీద ఉండడం, మరో పక్క వచ్చే వారం 24 Kisses లాంటి చిన్న సినిమా మినహా పోటీగా నిలిచే సినిమాలు ఏమీ లేకపోవడం, అదే క్రమంలో ఈ గురువారం “Thanksgiving Day” పుణ్యమా అని లాగ్ వీకెండ్ కావడంతో ట్యాక్సీ వాలా మరింత స్పీడ్ గా కలెక్షన్స్ రాబట్టడానికి మంచి అవకాశమే దొరికింది. అయితే వచ్చే గురువారం 29న తలైవార్ రజనీకాంత్ నటించిన “Robo-2.0” ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవనుండడంతో ట్యాక్సీ వాలా జోరుకు బ్రేక్స్ పడక తప్పదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

అయితే ఇప్పటికే $428K వసూళ్లు సాధించి మంచి ఊపు మీద ఉన్న విజయ్, పర్ఫెక్ట్ గా ఈ లాంగ్ వీకెండ్ డ్రైవ్ చెయ్యగలిగితే మిలియన్ మార్క్ కి కూత వేటు దూరంలో తన రైడ్ ని ముగించే అవకాశం ఉంది అని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి విజయ్ జోరు ఎంతవరకూ దూసుకు వెళ్తుందో చూద్దాం,

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Sandeepa Brings Pink Glam With Playful Ease!

Sandeepa Dhar brings a breezy burst of charm to this pastel-perfect gallery, slipping into a…

14 minutes ago

Ghost H-1B Slots: Applicants Face Frustration Over OFC Dates

H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…

34 minutes ago