Telugu

తన ప్రేమను వరల్డ్ ఫేమస్ చేసే పనిలో విజయ్ దేవరకొండ

యూత్ హార్ట్ త్రొబ్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ డైరెక్టర్ క్రాంతి మాధవ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. దానితో సినిమా పేరు ప్రకటించి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా సినిమాకు నామకరణం చేశారు. లవర్ బాయ్ గా పేరుగాంచిన విజయ్ కు ఇది సరైన టైటిల్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. ఈ నెల 20న ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవరకొండ చివరి సినిమా డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీనితో ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు. క్రాంతి మాధవ్ కూడా ఉంగరాల రాంబాబు అంటూ తన మీద ఇంప్రెషన్ కూడా చెడిపోయే రేంజ్ సినిమా ఒకటి తీసాడు. దానితో ఆయనకు కూడా ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం.

ఇప్పటివరకు ఈ చిత్ర బృందం ఈ సినిమాను ఎప్పుడు విడుదల చెయ్యాలి అనుకుంటున్నదీ చెప్పలేదు. ఫస్ట్ లుక్ తో పాటు దానిని ధృవీకరించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాలో నటిస్తున్నాడు విజయ్. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, హీరో చిత్రం పూర్తి చేసి ఆ తరువాత 2020 జనవరిలో పూరి జగన్నాధ్ తో చెయ్యబోయే ఫైటర్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడు విజయ్.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Prabhas Takes a Dig at Neel, Gets Salaar 2 Update

Prabhas turned a casual conversation with Prashanth Neel into a fun moment, and fans got…

4 hours ago

Udta Teer Public Talk: Mockery of Dhurandhar Working?

Ayushmann Khurrana and Sara Ali Khan’s Udta Teer has arrived in theatres on October 23,…

4 hours ago