
[m9ad]
కింగ్ ఫిషర్ నిర్వహణ కోసం అని నగదును విదేశాలకు తరలించి అక్కడ్నుంచి వాటిని ఫోర్స్ ఇండియా, ఆర్ సీబీ జట్టుకు చెల్లించాడని సదరు ఛానల్ పేర్కొంది. ఈ మేరకు మాల్యా, అతని సంస్థలోని ఉన్నతాధికారులకు మధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణల్ని బయటపెట్టింది. ప్రస్తుతం మాల్యాపై బ్రిటన్ లోని న్యాయస్థానంలో అక్రమ నగదు చెలామణి కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
భారత్ లోని యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి బ్రిటన్ లోని హెచ్ డీ ఎఫ్ సీ ఖతాకు ఇలా వేర్వేరు సందర్భాల్లో 500 కోట్ల ను మళ్లించారని ఈ-మెయిల్స్ లో తేలింది. అసలే నష్టాల్లో ఉన్న కింగ్ ఫిషర్ సంస్థ ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ఎందుకు స్పాన్సర్ చేస్తుందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కింగ్ ఫిషర్ సీఎఫ్ వో రఘునాథ్ మాల్యాకు మెయిల్ చేశాడు. అయినా బ్యాంకుల నుంచి రుణాలకు ఇబ్బంది ఉండబోదని హామీ కూడా ఇచ్చాడు.
After films like The Girlfriend, Chennai Love Story, and Couple Friendly, producer Dheeraj Mogilineni brings…
Tamil cinema has found an extremely talented youngster in the form of Pradeep Ranganathan, who…