
దీని మీద కన్నా, ఏపీ బీజేపీ నాయకులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇరుపక్షాలు ఇంత ఘాటుగా విమర్శలు చేసుకోలేదు. ఈరోజు విజయసాయి రెడ్డి తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా రంగంలోకి దిగి కన్నా మీద విమర్శలు చేస్తున్నారు.
“మొన్న ఆ మధ్య కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి సిద్ధమైతే చివరి నిముషంలో ఆయనను బీజేపీ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు కన్నా ను మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో కన్నా మీద గట్టిగా విమర్శలు చేసి… కన్నా చేసే విమర్శలకు బాగా పబ్లిసిటీ వచ్చేలా ప్రయత్నం జరుగుతుంది. దీనితో కన్నానే బీజేపీ ప్రెసిడెంట్ గా కొనసాగించేలా ఆ పార్టీ అధినాయకత్వన్ని విజయసాయి రెడ్డి ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు,” అని విశ్లేషకులు అంటున్నారు.
ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందా అనే అనుమానం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఏపీ బీజేపీ నుండి తమకు ఇబ్బంది కలగకుండా చూసుకునే ప్రయత్నమా? కన్నా ప్రభుత్వం కిట్ల విషయంలో అవినీతికి పాల్పడింది అని ఆరోపించారు. అదే ఆరోపణలు టీడీపీ కూడా చేసినా కన్నా చేసిన ఆరోపణల మీదే ఎక్కువగా విమర్శలు చేసి, ఆయనకే ఎక్కువ మీడియా పబ్లిసిటీ వచ్చేలా చేసింది వైఎస్సార్ కాంగ్రెస్. ఈ వ్యూహంలో టీడీపీకి మైలేజ్ రాకుండా అడ్డుపడినట్టు అయ్యింది.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…