
Vijay and Trisha spark fresh questions
తమిళనాడు సిఎం విజయ్, త్రిషల రిలేషన్‌షిప్ ఎంతవరకు వచ్చిందో తెలీదు కానీ లండన్ వెళితే అక్కడా ఆయన పక్కన ఆమె ప్రత్యక్షమయ్యింది.
కోలీవుడ్ హీరో అజిత్ లండన్, సిల్వర్ స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన ‘మిచెలిన్ లీ మాన్స్ కప్’ కార్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సిఎం విజయ్ అక్కడకు వెళ్ళినప్పుడు అయనని కలిసి ‘బెస్ట్ విషస్’ చెప్పి తిరిగి వచ్చి గ్యాలరీలో నిలబడి తొంగి చూస్తున్నారు.
ఆ గ్యాలరీలో అందరూ సెలబ్రిటీలే కూర్చుంటారు. కనుక రేసింగ్ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు తమ కెమెరాలను అటువైపు కూడా ఫోకస్ చేస్తుంటారు.
సిఎం విజయ్ అలా కెమెరాలకు చిక్కినప్పుడు, అదే గ్యాలరీలో అయన పక్కనే కూర్చొని ఉన్న త్రిష కూడా వచ్చి తొంగిచూశారు.
ఆమె హటాత్తుగా రావడంతో ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పుడు కెమెరాలలో రికార్డ్ అవడం మంచిది కాదనుకున్నారో లేక వెనక నుంచి ఎవరైనా పిలిచారో తెలీదు కానీ ఆమె రాగానే సిఎం విజయ్ చటుక్కున మొహం పక్కకు తిప్పేశారు.
ఇంకేముంది.. అంతవరకు అజిత్-విజయ్ మూడు దశాబ్దాల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించారంటూ కథలు కథలుగా వర్ణిస్తున్న మీడియా, ఇప్పుడా సంగతి వదిలేసి, సిఎం విజయ్-త్రిషల గురించి చర్చ మొదలుపెట్టింది.
సిఎం విజయ్ లండన్ పర్యటనకు త్రిషని వెంటబెట్టుకు వెళ్ళారా? విజయ్ లండన్ పర్యటనలో త్రిష ఉందంటే అర్థం ఏమిటి? లేక ఆమె సినిమా షూటింగ్ ఇలా ప్లాన్ చేసుకొని లండన్ వచ్చారా?
త్రిషతో అఫైర్ ఇంత బహిరంగం అయిన తర్వాత ఆమె గ్యాలరీలో నుంచి తొంగి చూసినప్పుడు సిఎం విజయ్ మొహం ఎందుకు పక్కకు తిప్పుకున్నారు? ఇద్దరూ కలిసి మీడియాకు హాయ్ చెప్పొచ్చు కదా?
విజయ్ భార్య సంగీత విడాకుల కేసు వెనక్కు తీసుకున్నారు కదా? కనుక ఆమెతో సిఎం విజయ్ కాపురం కంటిన్యూ చేస్తారా… లేదా?వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన మొహం పక్కకు తిప్పుకున్నప్పటికీ వారిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.
లండన్ పర్యటనలో కూడా అయన పక్కన త్రిష ఉందంటే, భార్యతో కలిసి జీవించడానికి అంగీకరించడం లేదనే కదా అర్థం? మరి అలాంటప్పుడు విడాకులు తీసుకొని, త్రిషని పెళ్ళి చేసుకొని మమ అనిపించేసి ఇలాంటి స్పైసీ వార్తలకు ముగింపు పలకవచ్చు కదా? ఇంకా ఎంతకాలం ఇలా?
For years, Mega fans have been waiting for clarity on Vishwambhara. Now, the film has…
అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అనే మాట విన్నాము కానీ ప్రభుత్వ భూమిని అల్లుడు మామకు దానం చేసినట్లు…