
తమిళ రాజకీయాలలోకి TVK తో విజయ్ అరంగేట్రం చేయడంతో ఈసారి తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. TVK ఒంటరి పోరాటం చేస్తుందని, ఏ పార్టీతో రాజకీయ పొత్తులు పెట్టుకోదు అంటూ TVK పార్టీ అధినేత విజయ్ ప్రకటనతో TVK మరో PRP అవుతుందా లేదా JSP గా మారుతుందా అన్న చర్చ జరుగుతుంది.
2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తిరుపతి వేదికగా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటన చేసారు. దానితో ఇక 2009 లో ఏపీ లో అధికారంలోకి వచ్చేది ఎవరు అన్న ఆసక్తి సర్వత్రా కనిపించింది. అప్పటికి అధికార పార్టీగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో టీడీపీ ఎన్నికల పోరుకు సిద్ధమయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం ఒంటరి పోరాటంతో ఎన్నికల బరిలోకి దిగిన చిరు అధికార పార్టీ ఓట్లు చీల్చి ప్రతిపక్ష టీడీపీ ని రాజకీయంగా దెబ్బకొట్టారు. PRP ఒంటరి పోరు అధికార కాంగ్రెస్ కి కలిసిరావడంతో టీడీపీ మరోమారు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అలాగే అధికారం కోసం ఆశపడిన PRP18 సీట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇక 2014 ఎన్నికలకు ముందు JSP తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పొత్తుకు మద్దతు ప్రకటించారు, ఫలితంగా వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
అలాగే 2019 లో ఒంటరిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీడీపీ ని ప్రతిపక్షానికి తెచ్చింది, వైసీపీ ని అందలం ఎక్కించింది. దీనితో 2024 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ పవన్ చేసిన ఒక్క ప్రకటన ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది.
పవన్ చేసిన ఈ ఒక్క ప్రకటన 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ని 11 సీట్లకు తీసుకొచ్చి కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. అలాగే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చి పవన్ ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది.
దీనితో 2019 ఎన్నికలలో జేఎస్పీ ఒంటరి పోటీ పవన్ ను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయేలా చేస్తే, 2024 ఎన్నికలలో JSP కూటమి పోటీ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించేలా చేసింది.
Crazy Kalyanam is moving ahead of its theatrical release by arriving earlier than originally planned.…
There is a different side of Teja Sajja to be seen in The Traitors Telugu.…