
ప్రిన్స్ మహేష్ బాబు బాలనటుడిగా వెండితెరపై విజ్రుంభిస్తున్న సమయంలో… సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన “శంఖారావం” సినిమాలో మహేష్ బాబుతో నవీన్ కూడా కలిసి నటించాడు. ఇదే విషయాన్ని కృష్ణ సతీమణి విజయనిర్మల ఆడియో వేడుకపై గుర్తు చేసారు. అయితే “అప్పుడు నటించడం కాదు, ఇప్పుడు కృష్ణ గారి వారసులంతా మహేష్ బాబుతో కలిసి ఓ సినిమాలో కలిసి నటిస్తే చూడాలని ఉంది” అంటూ తన మనసులోని అభిలాషను కూడా బయటపెట్టారు.
ఇక, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే మహేష్ బాబు… “కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ సక్సెస్ దక్కుతుందని నమ్ముతానని, నవీన్ ఎడిటర్ గా పని చేస్తున్న సమయంలో… నువ్వు తర్వాత ఏం అవుదాం అనుకుంటున్నావు? అని అడిగితే ‘నటించాలని ఉంది’ అని చెప్తే… తనకు నిజమో, కాదో తెలియలేదని, ఎందుకంటే… అప్పుడు నవీన్ చాలా లావుగా ఉండేవాడని, అయితే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ చూస్తే… సన్నగా, సిక్స్ ప్యాక్ లో కనపడ్డాడని, అంతలా మారిపోవడం చూసి నేనే ఆశ్చర్యానికి గురయ్యానని, అంత కష్టపడిన నవీన్ కు మంచి సక్సెస్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని” ప్రిన్స్ వ్యాఖ్యానించారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…