Telugu

సాయి రెడ్డి వైసీపీ లో మరో కోణం బయటపెడుతున్నారా..?

వైసీపీ పొలిటికల్ ఎంట్రీ తో రాష్ట్రంలో కుల రాజకీయాల ప్రాధాన్యత పెరిగింది అనేది జగమెరిగిన సత్యమే. అయితే ఇదంతా వైసీపీ రాజకీయంలో కనిపించిన ఒక కోణమే అని దానికి మరో కోణం కూడా ఉందని సాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం గా ఉన్న జగన్ రాష్ట్రంలో మత మార్పిడిలను ప్రోత్సహించారంటూ వైసీపీ రాజకీయంలో కంటికి కనిపించని ఆ రెండో కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. సాయిరెడ్డి చేసిన ఈ ప్రకటనతో గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులను, అందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన జవాబులను ప్రజలు బేరీజు వేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడ ఇంద్రకీలాద్రి సాక్షిగా దుర్గ ఘాట్ లో మత మార్పిడిలు జరిగుతున్నాయంటూ నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆరోపించారు. అయితే నాటి పవన్ వ్యాఖ్యలను రాజకీయ విమర్శలుగా కొట్టిపిపారేసిన వైసీపీ మరి ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ, జగన్ కి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలను కూడా రాజకీయ విమర్శలుగా చెప్పగలరా..?

వైసీపీ కొఠరి రాజకీయాన్ని తట్టుకోలేక 2025 లో వైసీపీ కి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న సాయిరెడ్డి తిరిగి మరో కొత్త పార్టీతో పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ నేపథ్యంలో విజయసాయి తన మాజీ పార్టీ పై ఆ పార్టీ అధినేత పై మత రాజకీయాల ముద్ర వేసే స్థాయికి వెళ్లారంటే వైసీపీ యొక్క ఆ ఘండి కోట రహస్యాలు సాయిరెడ్డి కి ఎరుకేనా..? దాదాపు సాయిరెడ్డి వైసీపీ తో రెండు దశాబ్దాల రాజకీయ ప్రయాణం కొనసాగించారు.

అలాగే వైసీపీ లో కూడా జగన్ తరువాత స్థానంలో కొనసాగారు. అటువంటి సాయిరెడ్డి జగన్ తన ప్రభుత్వ హయాంలో మత మార్పిడిలను ప్రోత్సహించారని, రాష్ట్రంలో అనేక చర్చ్ ల నిర్మాణానికి తోడ్పాటును అందించారే కానీ ఎన్నడూ హిందూ మతాన్ని ప్రోత్సహించలేదంటూ సాయిరెడ్డి చేస్తున్న విమర్శలు వైసీపీ ను రాజకీయంగా ఇరకాటంలో పడేస్తున్నాయి.

మరి జగన్ పై మత రాజకీయ ముద్ర వేస్తున్న వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ ముందుకొస్తుందా..? లేదా వైసీపీ ఒక్క అడుగు ముందుకేస్తే సాయిరెడ్డి వైసీపీ గత చరిత్రను ఎన్ని అగుడులు తవ్వుతారో అన్న భయంతో మౌనాన్నే ఆశ్రయిస్తారా..?

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Nana’s Death Deserves Dignity but Can It Erase Allegations?

Nana Patekar passed away in Goa on October 8 at the age of 75 due…

19 minutes ago

Sree Vishnu on Comrade Kalyan’s Audience Response

Sree Vishnu has established himself as an entertainer in Telugu Cinema. His latest movie, Comrade…

39 minutes ago