
విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని అశోక్ నగర్లో బుదవారం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరుపేద రజకులకు రూ.49 వేలు ఖరీదు చేసే ఏడు ఇస్త్రీ పెట్టెలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం ఆసరా పధకం కింద ఒక్కొక్కరికీ పదివేలు ఇస్తోందని చెప్పుకొంటోంది. కానీ ఆ పధకం వైసీపీ కార్యకర్తలకే పరిమితమైనట్లుంది. ఓ 20 శాతం మందికి మాత్రమే ఆ పధకం అందుతోంది. మిగిలినవారు దాని కోసం కార్యాలయాల చుట్టూ తిరగడమే తప్పితే వారికి అందడం లేదు. కానీ ఈ పధకం గురించి జగన్ ప్రభుత్వం కోట్లు రూపాయలతో సొంత పత్రికలో ప్రకటనలు ఇచ్చుకొంటోంది. పైగా ఆ పత్రికలో పనిచేసేవారిని సలహాదారులుగా నియమించుకొని మళ్ళీ వారికి లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోంది,” అని ఆరోపించారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…