
ఒక కొత్త హీరో సెంటిమెంట్ కధను ఎంపిక చేసుకోవడం ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఆ ఏమోషన్స్ ను సరిగా పలికించకపోతే తీవ్ర విమర్శలకు గురికాక తప్పదు. మరి దీనిని కళ్యాణ్ దేవ్ ఎలా అధిగమించాడు అనేది సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. ట్రైలర్ లో చూపించిన షాట్స్ ప్రకారం అయితే, మొదటి సినిమా కాబట్టి ‘జస్ట్ ఓకే’ మార్కులు మాత్రమే పడతాయి.
జులాయిగా తిరిగే కొడుకు… బాధ్యతగా కనిపించే తండ్రి… తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అయితే వీటిని తెరపై ఎలా ఆవిష్కరించారు? అనేదే కీలకం. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వారాహి ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. శెంతిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. జూలై 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…