Telugu

ట్రైలర్ టాక్ – ‘రాజా’ ఔర్ ‘రాణి’గా చియాన్ అదుర్స్!

పాత్రల కోసం ప్రాణం పోసే నటులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలా ఇండియాలో ఒక్క కమల్ హాసన్ పేరు మాత్రమే మొదటగా చెప్తారు. ఆ తర్వాత స్థానాన్ని కూడా దక్షిణాది హీరో, తమిళ రంగంలో రాణిస్తున్న మన తెలుగు వాడైన ‘చియాన్’ విక్రమ్ అన్న పేరు వినిపిస్తుండేది. అయితే తాజాగా విడుదలైన “ఇరుముగన్” ట్రైలర్ తో కమల్ తర్వాత స్థానం చియాన్ దేనని స్టాంప్ వేసుకోవచ్చు… అంతలా రెండు విభిన్నమైన పాత్రల్లో విక్రమ్ మెరిసాడు.

ADVERTISEMENT

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ వీక్షకులను కట్టిపడేస్తోంది. ఎంతలా అంటే… ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ కూడా ఈ సినిమా ట్రైలర్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసేటంతగా..! ఈ సినిమా ట్రైలర్ గురించి చెప్పడం కంటే వీక్షించడం ఉత్తమం. అయితే ‘చియాన్’ అభినయాన్ని మాత్రం ప్రశంసించకుండా ఉండలేం. ‘రాజా’ ఔర్ ‘రాణి’ రెండు విభిన్న పాత్రల్లో ప్రదర్శించిన విలక్షణత ఖచ్చితంగా విక్రమ్ వలనే సాధ్యం అన్నంతగా ప్రేక్షకులను ప్రభావితం చేస్తాడు.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, హారిస్ జయరాజ్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, రాజశేఖర్ ఫోటోగ్రఫీ, దర్శకుడు ఆనంద్ శంకర్ టేకింగ్… అన్ని ట్రైలర్ నిండా ఆకట్టుకుంటాయి. అయితే కధ విషయం మాత్రం ‘సస్పెన్స్’ అలాగే కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫేస్ కనపడకుండా హల్చల్ చేసిన పోస్టర్లలో కూడా ఉన్నది విక్రమ్ అన్న విషయాన్ని చివర్లో రివీల్ చేసి, మరింత ఆసక్తిని పెంచారు. ఈ ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజమే.

Share
Published by

Recent Posts

Mahesh Babu with Mamitha Baiju: Is It Really Cooking?

Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…

16 minutes ago

Before The Shoot Wraps, Goodachari 2 Gets Big Praise

Adivi Sesh’s Goodachari 2 has got a strong reaction even though the shooting is still…

46 minutes ago