Telugu

రాకకు రంగం సిద్ధమా..?

గత ఏడాది టి-20 వరల్డ్ కప్ గెలిచినా పిమ్మట భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ పొట్టి ఫార్మటు కు తమ వీడ్కోలు అంటూ ఎవరు ఊహించని విధంగా టి-20 ల కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక, భారత టెస్ట్ జట్టు తీవ్ర ఒత్తిడి లో ఉన్నప్పుడు మరలా ఈ ఇరువురు టెస్ట్ ఫార్మటు కు సైతం ఒకే సమయంలో వీడ్కోలు పలికారు.

కారణాలేవైనా గాని, ఇలా ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించటం అటు ఫాన్స్ కు, ఇటు జట్టు కు భారీ ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. అయితే, ఐపీఎల్-2025 ముగిశాక రో-కో లు మైదానం పైన కనపడలేదు. ఐపీఎల్ ముగిసి సుమారు 4 నెలలు కావస్తున్నా, వారి ఆడుతుంది కేవలం వన్-డే ఫార్మటు కాబట్టి, ఐపీఎల్ తరువాత చాలా గ్యాప్ వచ్చింది.

ADVERTISEMENT

ఆస్ట్రేలియా వెళ్లి ఆస్ట్రేలియా తో ఆడనున్న వన్-డే సిరీస్ కు ఇంకా తుది జట్టు ప్రకటించకపోయినప్పటికీ, ఇటు రోహిత్ కెప్టెన్ గా, కోహ్లీ జట్టు లోని మోస్ట్ సీనియర్ ప్లేయర్ గా తమ సేవలను అందించటం ఖాయం గా నే కనిపిస్తుంది. మళ్ళీ తమ ఫెవరెట్ క్రికెటర్లను మైదానం లో చూడబోతున్నం అంటూ ఫాన్స్ ఇప్పటినుండే ఖుషి అవుతున్నారు.

కాగా, ఈ ఆస్ట్రేలియా-భారత్ వన్-డే సిరీస్ ను ఇంకా ఉత్కంఠపరిచేలా ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొత్తిఞ్చది. ఈ 3-మ్యాచ్ల సిరీస్ లో జరగబోయే 3వ మ్యాచ్ ను ఆస్ట్రేలియా బోర్డు చివరిగా తమ దేశంలో ఆడనున్న ఇరువురు దిగ్గజాలు- విరాట్ మరియు రోహిత్ కు ఫేర్వెల్ మ్యాచ్ గా జరపనున్నట్లు టాక్.

ఏది ఏమైనప్పటికి, ప్రస్తుతం వీరిద్దరి కన్ను సౌత్-ఆఫ్రికా వేదికగా ఆడనున్న 2027 వరల్డ్ కప్ పైనే అనటంలో అతిశయోక్తే లేదు. 2023 లో జరిగిన వరల్డ్ కప్ లో నే ఛాంపియన్స్ గా నిలుస్తాం అనుకున్న వేళా, ఆసీస్ ట్రోఫీ ను ఎగరేసుకుపోయింది. చూడాలి మరి, ఈ సీనియర్ల జోడి భారత్ కు 3వ వరల్డ్ కప్ ను అందిస్తుందా అని..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రతిపక్షాలకు మాత్రమే: గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత…ఓడితే ప్రభుత్వ దౌర్జన్యం…

స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన…

18 minutes ago

Nani’s The Paradise: Is an A Certificate Waiting?

Nani’s The Paradise is heading towards a September 24 release with a 2 hour 49…

21 minutes ago