
ఇప్పటికే టెస్ట్ మరియు టీ-20 ఫార్మాట్లకు గుడ్ బాయ్ చెప్పేసిన కింగ్ కోహ్లీ, కేవలం వన్ డే ఫార్మాట్ లో మాత్రమే దర్శనమిస్తున్నారు. దగ్గర లో టీ-20 ప్రపంచ కప్ ఉన్న యడల, ప్రస్తుత భారత షెడ్యూల్ లో టీ-20 లకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉండటం వల్ల కింగ్ చాలా అరుదుగా కెమెరాకు చిక్కుతున్నాడు.
అయితే కం-బ్యాక్ సిరీస్ గా ఆస్ట్రేలియా పై ఆడినప్పటికీ, అది ఫాన్స్ ను పూర్తిగా ఖుషి చెయ్యలేకపోయింది. మొదటి రెండు మ్యాచ్లలో డక్ అవుట్ గా వెనుతిరిగిన విరాట్ తనపై కురిసే ప్రశ్నల బాణాలకు ఈ ప్రదర్శన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. 3వ మ్యాచ్ లో 70 కొట్టినప్పటికీ, ఫాన్స్ కు అది కంటి తుడుపు ఇన్నింగ్స్ లా మాత్రమే పనిచేసింది.
ఇదిలా ఉంటే అసలే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ తో ఘోర పరాభవాన్ని ఎదుర్కొటున్న టీం ఇండియా ఇక ఇప్పుడు జరగబోయే వన్ డే సిరీస్ అయినా నెగ్గి పరువులు నిలుకోవాలని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొటుంది. ఇటువంటి సమయంలో జట్టులోకి రో – కో ల ఎంట్రీ ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానికి కొత్త ఆశలు చిగురింపచేశాయి.
మరీ ముఖ్యంగా ఈసారి కింగ్ విశ్వరూపం చూపించనున్నాడు అనే మాట ప్రతి కింగ్ కోహ్లీ ఫ్యాన్ నోటా వినపడింది. ఇక దానికి తగ్గట్టే రాంఛీ లో విరాట్ అడుగుపెట్టినప్పటి నుండి తాను చేసిన ప్రతి పని ఒక సెన్సేషన్ గా నే మారింది.
రాంఛీ లోకల్ బాయ్ మరియు తన గురువు ‘ఎం ఎస్ ధోని’ ను కలిసేందుకు అతని నివాసానికి వెళ్లిన కోహ్లీ, తిరిగి ధోని కార్ లో కలిసి బయట కనిపించిన ఫోటోలు సోషల్ మీడియా ను షేక్ చేసాయి. ఈ విషయాలన్నీ చూసాక ఫ్యాన్స్ ఈసారి గట్టిగా ఏదో జరగనుంది అని అనుకుంటేనే ఉన్నారు.
ఈలోగా కింగ్ వచ్చి తనను ప్రశ్నించిన వారందరికీ 135 పరుగులతో 135 విధాలుగా గట్టిగా బదులిచ్చాడనే చెప్పాలి. నిన్నటి మ్యాచ్లో విరాట్ మనం గత 4-5 ఏళ్లగా చూస్తున్న విరాట్ లా కనిపించలేదు. కరోనా ముందు 2017-19 తన పీక్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎలా బ్యాటింగ్ చేసేవాడో, నిన్న అచ్చు గుద్దినట్టు అలానే కనపడ్డాడు.
సిక్సర్ల పై సిక్సర్ల కొడుతూ, అభిమానుల నుండి “వావ్” బదులు “హౌ” అనే రీతిలో బ్యాట్టింగ్ చేసాడు. అయితే, నిన్నటితో విరాట్ 83 ఇంటర్నేషనల్ సెంచరీలు పూర్తి చేసుకుని, 100 సెంచరీలు ఇంకా 17 అడుగుల దూరంలో ఉన్నాడు.
అయితే అభిమానులకు మాత్రం ఇది కేవలం ఒక సెంచరీ కాదు, గ్రౌండ్ లో తాను చూపించిన అగ్రేషన్, తన అగ్రెసివ్ బ్యాట్టింగ్ అప్రోచ్, అపోజిషన్ వికెట్ పడగానే తాను గంతేసి సెలెబ్రేట్ చేసుకునే సన్నివేశాలను మళ్ళీ చూసి మంత్రముగ్ధులవుతున్నారు.
అయితే ఇదంతా ధోని ఇచ్చిన బూస్ట్ ఆ.? లేక ఓటమి పరాభవం నుంచి భారత్ కు గెలుపు గర్వం ఇవ్వాలన్న ఎగ్రెషన్ ఆ.? మరి తనలో ఉన్న వింటేజ్ విరాట్ ను బయటకు తీసిన కోహ్లీకి 2027 వరల్డ్ కప్పు జట్టు సెలెక్షన్ లో తనపై వస్తున్న ప్రశ్నలకు బదులిచ్చేసినట్టేనా..?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…