
మూడవ రోజు మొత్తం వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావించిన క్రీడా పండితులకు షాక్ ఇచ్చి, అల్ రౌండ్ ప్రతిభతో సత్తా చాటింది టీమిండియా. నాలుగవ రోజు భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ స్పెల్ మ్యాచ్ ను మలుపు తిప్పగా, ఆ తర్వాత వేగంగా పరుగులు చేసి, 217 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 346 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ జట్టు కేవలం 47.3 ఓవర్లలోనే చాపచుట్టేసి మ్యాచ్ ను టీమిండియా వశం చేసింది.
బౌలింగ్ లో అందరూ సమిష్టిగా రాణించడంతో విజయం సులభం అయ్యింది. భువనేశ్వర్ కుమార్ 1, షమి 3, ఇషాంత్ శర్మ 2, జడేజా 2, అశ్విన్ 1 వికెట్ తో తమ ప్రతిభ చూపారు. ఈ విజయంతో కోహ్లి పేరు మరోసారి మారుమ్రోగుతోంది. సచిన్, గంగూలీ, ద్రావిడ్ వంటి హేమాహేమీలు ఉన్నప్పుడు కూడా సాధించలేని విజయం వశం కావడంతో, జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు కూడా ఫుల్ ఖుషీలో మునిగితేలుతున్నారు.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…