
ఇవన్నీ సరిపోక టెక్నాలజీ పెరిగాక వీలైనంత మేరకు పబ్లిక్ లో మూవీ గురించి చర్చ జరగడం కోసం ప్రొడ్యూసర్లు ఖర్చు అవుతున్నా సరే ఈవెంట్ల పరంపరకు తెరతీశారు. టీజర్ లాంచ్, ఇంజనీరింగ్ కాలేజీ లాంటి పెద్ద పబ్లిక్ ప్లేస్ లో లిరికల్ వీడియో విడుదల, ప్రీ రిలీజ్ వేడుక, వీలుని బట్టి వివిధ నగరాలకు వెళ్లి షాపింగ్ మాల్స్ లో స్వయంగా హీరో హీరోయిన్లు లేదా యూనిట్ సభ్యులు సామాన్య జనంతో మాట్లాడ్డం, ఆడియో ఫంక్షన్ లేదా ప్రెస్ మీట్ పేరుతో మొత్తం మీడియా ప్రతినిధులందరితోనూ ప్రత్యేక సమావేశాలు ఇలా ఒక సిరీస్ ప్రకారం చేసుకుంటూ పోతున్నారు.
ఇవి చాలడం లేదు. ఇంకేదో వినూత్నంగా చేయాలి. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష టీమ్ కొత్తగా సినిమాలో పాత్రలను పరిచయం చేయడం కోసం గ్రాండ్ గా ఒక ఈవెంట్ చేసింది. అంటే ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు వాటి తీరు తెన్నులను వివరించడమన్న మాట. మాములుగా ఈ తతంగం పోస్టర్ల రూపంలో ఒక్కో ఆర్టిస్టుది విడివిడిగా ఆన్ లైన్ లో సర్కులేట్ చేసి ప్రచారం చేసేవారు. ఇప్పుడిలా కాదని ఏకంగా క్యారెక్టర్స్ ఇంట్రో పేరుతో మరో నయా ట్రెండ్ కి తెరతీశారు. రాబోయే రోజుల్లో ఇదీ ఒక అలవాటుగా మారినా ఆశ్చర్యం లేదు.
వీటి వల్ల నిర్మాత జేబుకు తడిసి మోపెడవుతున్నా వరసగా తన చిత్రం గురించి కవరేజ్ వస్తూనే ఉంటుంది. ఆ ఫోటోలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ టాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఫ్యాన్స్ ఎలాగూ వాటిని రకరకాల రూపాల్లో వైరల్ చేస్తారు. ప్రత్యక్షంగా మీడియా హాజరయ్యింది కాబట్టి అన్ని మాధ్యమాల్లో వార్తలు, శీర్షికలు వచ్చేస్తాయి. ఇదంతా తప్పలేక తప్పక చేస్తున్న తప్పు కాని తిప్పలు. పరిమితంగా పబ్లిసిటీ చేస్తే ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో చేరుకోలేని పరిస్థితిలో ఇలాంటివి కొత్త టెక్నిక్కులు తీసుకురావాల్సిందే
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…