Telugu

ఆత్మలతో యుద్ధంలో విరూపాక్ష గెలిచాడా

మూఢ నమ్మకాలను ఆధారంగా చేసుకున్న హారర్ సినిమాలు మనకు కొత్తేమీ కాదు. అందులోనూ బ్లాక్ మేజిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ పాతిక ముప్పై ఏళ్ళ క్రితం లెక్కలేనన్ని వచ్చేవి. యండమూరి వీరేంద్రనాధ్ తులసిదళం నవల వచ్చాక చేతబడి అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. క్షుద్రశక్తులు, ఆవాహన, ఆత్మలు, ఆవహించడాలు ఇవన్నీ ఆయన రాసిన పుస్తకాల్లో వివరంగా ఉండేవి. ఈ బుక్కుల ఆధారంగానే శరత్ బాబు హీరోగా ఒకటి, రాజేంద్రప్రసాద్ టైటిల్ పోషించిన కాష్మోరాలు వచ్చాయి. ఇవొచ్చి దశాబ్దాలు దాటిపోవడంతో దర్శకుడు కార్తీక్ దండు మరోసారి ఆ ప్రపంచాన్ని కొత్త సాంకేతికతతో పరిచయం చేయాలని విరూపాక్షతో వచ్చాడు .

అనగనగా రుద్రవనం అనే అడవి గ్రామం. అక్కడికి వచ్చిన సూర్య(సాయి ధరమ్ తేజ్)కు అంతు చిక్కని రీతిలో గ్రామస్తుల చావులు పెద్ద సవాల్ విసురుతాయి. ఈ వ్యవహారం ఏకంగా తన ప్రియురాలి(సంయుక్త మీనన్)ప్రాణాల మీదకు తేవడంతో సూర్య స్వయంగా రంగంలోకి దివి ఇవి ఆత్మహత్యలా లేక దెయ్యాలు భూతాలు చేశాయాని తేల్చడానికి బయలుదేరతాడు. అప్పుడే ఈ మరణాలకు పదిహేనేళ్ల క్రితం అదే ఊరిలో జరిగినా ఒక దారుణమైన ఘటనకు సంబంధం ఉందని అర్థమవుతుంది. ఇవి చేస్తున్నదెవరో తెలిసేసరికి ఊహించని ఉత్పాతం ఎదురవుతుంది. మధ్యలో జరిగే అసలైన కథ వేరే ఉంది.

ADVERTISEMENT

సుకుమార్ స్క్రీన్ ప్లే సహాయంతో కార్తీక్ దండు రాసుకున్న సబ్జెక్టులో విషయముంది. అంతుచిక్కని రీతిలో మనుషుల ప్రాణాలు పోవడం, వాటి వెనుక ఎవరున్నారనే ఆసక్తిని రేపడం ఏ థ్రిల్లర్ లో అయినా మనకు కనిపించే బేసిక్ పాయింట్. ఇలా వింటే ఇందులో ఎలాంటి ప్రత్యేకత అనిపించదు.

అందుకే కార్తిక్ తెలివిగా రుద్రవనం సెటప్ తీసుకున్నాడు. తగినన్ని థ్రిల్స్ రాసుకున్నాడు కానీ వాటిని బాగా ఎలివేట్ అయ్యేలా ప్రెజెంట్ చేయడంలో కొంచెం తడబడ్డాడు. ఉదాహరణకు ఒంటరిగా వెళ్తున్న తనను పక్కఊరి వాళ్ళు గుంపుగా దాడి చేసినప్పుడు సూర్య చేసే పోరాటం గూస్ బంప్స్ అనిపించాలి. అలాంటివాటికి చాలా అవకాశం ఉన్నా సీరియస్ గా తీసుకోలేదు.

ఎక్కడిక్కడ ట్విస్టులు థ్రిల్స్ అయితే ఉన్నాయి. సాంకేతిక వర్గం కష్టం కనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ కు తగినంత ఆసక్తిని సృష్టించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అదే టెంపోని కొనసాగించడంలో పూర్తిగా సఫలం కాలేదు. అందుకే విజువల్స్ ఎంత భయపెట్టేలా ఉన్నా సరే అరుంధతి స్థాయి హారర్ ఫీల్ కాము.

క్లైమాక్స్ లో ఉన్న నాటకీయత అధిక శాతం ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుందనే దాన్ని బట్టి హిట్టు స్థాయి పెరగడం తగ్గడం ఉంటుంది. ఒక విభిన్నమైన అనుభూతిని అందించడంలో విరూపాక్ష బృందం ఓ మోస్తరుగా సక్సెస్ అయినట్టే. సాయిధరమ్ తేజ్ ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిదే. తెరనిండా తారాగణం ఉన్నా ఎవరినీ పూర్తిగా వాడుకోలేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

MS Dhoni to Become CSK Mentor in IPL 2027?

MS Dhoni's role at Chennai Super Kings (CSK) has become a talking point ahead of…

8 minutes ago

Prahaar Review: Controversial Subject, Weak Screenplay

After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…

37 minutes ago