
రెండవ నమూనాను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అది కూడా నెగటివ్ గా ఉంటే, అతన్ని డిశ్చార్జ్ చేస్తారు మరియు 14 రోజులు హోమ్ – క్వారంటైన్ లో ఉండమని అడుగుతారు. ఇప్పటికే నెల్లూరు నుండి ఒక రోగి డిశ్చార్జ్ అయ్యారు మరియు హోమ్ – క్వారంటైన్ లో ఉన్నారు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో కోలుకునే రెండవ కేసు ఇది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు పదమూడు కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు ఇరవై రెండు అనుమానిత కేసుల రిపోర్టులు రాగా అన్నీ నెగటివ్ గానే తేలాయి అని ప్రభుత్వం తెలిపింది. దానితో ఈరోజు ఉదయం కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదు. మరోవైపు తెలంగాణాలో చివరి సారిగా తెలిసిన దాని ప్రకారం 59 కేసులు నమోదు అయ్యాయి.
నిన్న ఒక్క రోజే తెలంగాణాలో పది కేసులు నమోదు అయ్యాయి. అయితే రోజుకు రెండు మెడికల్ బులెటిన్లు విడుదల చేసే రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుండి ఒక్క బులెటిన్ కూడా విడుదల చెయ్యకపోవడంతో కేసులు బాగా ఎక్కువగా నమోదు అయ్యాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…