Telugu

గామి గురించి ఎవరూ మాట్లాడరేమి?

ఓ పెద్ద హీరోతో ఓ పెద్ద దర్శకుడు సినిమా చేయబోతున్నాడనే ‘ఆలోచన’తోనే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఓటీటీ ప్లాట్ ఫారం మీదుగా గమ్యం చేరుకునే వరకు అందరూ దానితో ట్రావెల్ చేస్తూ దాని గురించే మాట్లాడుతుంటారు. దానిలో ఉన్నవీ లేనివీ కూడా ఊహించుకొని మరీ గొప్పగా చెప్పుకొని సంతోషపడుతుంటారు.

ఆ సినిమా ఎంత చెత్తగా ఉన్నా సూపర్ హిట్ అని ఏడ్వలేక నవ్వుతూ చెప్పుకుంటారు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సక్సస్ మీట్లు కూడా పెట్టుకొని ఆత్మవంచన చేసుకుంటారు. ఇప్పుడు ఆ హీరోలు, దర్శకులు, వారి సినిమాల పేర్లు చెపితే చాలామందికి కోపతాపాలు మొదలైపోతాయి. కనుక అందరికీ తెలిసిన వారి సినిమాలని కేవలం దీనికి రిఫరెన్స్‌ మాత్రమే అనుకొని విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘గామి’ గురించి నాలుగు ముక్కలు చెప్పుకుందాము.

ADVERTISEMENT

విద్యాధర కాగిత దర్శకత్వంలో తెర కెక్కించిన ‘గామి’ కధాంశం, దాని కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు పడిన కష్టం సినిమాలో ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది. గామిలో హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ చూస్తున్నప్పుడు ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది.

ఈ సినిమా కోసం విశ్వక్ సేన్‌తో సహా అందరూ దాదాపు ఆరేళ్ళు ఎంతో కష్టపడ్డామని చెప్పారు. వారి కష్టం సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారు ఆరేళ్ళు కష్టపడి సినిమా తీశారు కనుక బాగోనప్పటికీ మెచ్చుకోవాలా? అవార్డులు ఇవ్వాలా? అనే ధర్మ సందేహం తప్పక వస్తుంది.

సినిమా కోసం ఎవరు ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంత పెద్ద హీరోతో తీసినప్పటికీ బాగోకపోతే ప్రేక్షకులే రిజక్ట్ చేసేస్తారని అందరికీ తెలుసు. కానీ గామి సినిమాలో కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగింది. ఎందుకో అందరికీ తెలుసు.

ముఖ్యంగా ఇండస్ట్రీలో వారికి ఇంకా బాగా తెలుసు. కనుక తెలుగులో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా వచ్చినప్పుడు, దాని గురించి సినీ పెద్దలు నాలుగు మంచి మాటలు చెప్పొచ్చు కదా?చెప్పి ప్రోత్సహిస్తే ఇంకా అటువంటి మంచి సినిమాలు వస్తాయి కదా?

కానీ గామి గురించి ఎవరూ ఎందుకు నాలుగు మంచి ముక్కలు చెప్పడానికి వెనకాడుతున్నారు. పనిగట్టుకొని కొందరు ‘గామి’ గురించి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? అని విశ్వక్ సేన్ అడిగిన ప్రశ్న ఇండస్ట్రీలో పెద్దలకు వినబడే ఉంటుంది.

కనుక ఎప్పుడూ పెద్ద హీరోలు, వందల కోట్ల బడ్జెట్‌తో ఏళ్ళ తరబడి ఒకే సినిమా తీసే పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలు, వారి సినిమాల గురించి మాత్రమే కాకుండా బలగం, జయమ్మ పంచాయితీ, జాతిరత్నాలు, మిడిల్ క్లాస్ మెలోడీస్, హనుమాన్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, గామి వంటి చక్కటి సినిమాల గురించి మాట్లాడితే ఇండస్ట్రీకే మంచిది కదా?

ఇటువంటి సినిమాలను ప్రమోట్ చేసే బదులు తొక్కేయాలనుకుంటే, తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ‘మాస్ మసాలా… నరుకుడు’ సినిమాలలోనే సంతోషం వెతుక్కొని సంతోషపడక తప్పదు.

ఒకప్పుడు ‘ఏ’ గ్రేడ్ బూతు సినిమాలకే పరిమితమైన మలయాళ సినీ పరిశ్రమ ఆలోచనలలో సమూలంగా మార్పు వచ్చినందునే గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. వాటినే మనం రీమేక్ చేసుకొని చూసుకొని సంతోషపడుతున్నాము కూడా.

“ఇప్పుడు మలయాళ సినిమాలను చూసి మేము కూడా అసూయపడవలసి వస్తోందని” రాజమౌళి అన్నారు. తెలుగులో కూడా అటువంటి మంచి సినిమాలు వస్తున్నప్పుడు, సినీ పెద్దలు పలుకే బంగారమాయే అనుకోకుండా దాని గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడితే బాగుంటుంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Review: U.S. Premiere Report

Jailer 2 is the sequel to Nelson’s superhit Jailer. Stay tuned for the Jailer 2…

1 hour ago

AK47 Confusion Turns Double Trouble for Venkatesh?

Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…

7 hours ago