
వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ సీపీ మీనాను కలిశారు. ఎయిర్‌పోర్టులో చంద్రబాబును ప్రజా సంఘాలు, ప్రజలే అడ్డుకుని ఆందోళన చేశారని తెలియజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… జై అమరావతి అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేసి రెచ్చగొట్టడం వల్లే చంద్రబాబును ప్రజలు అడ్డుకున్నారన్నారు
అంతవరకూ బానే ఉంది… చంద్రబాబు విశాఖకు మళ్లీ వచ్చినా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఇది కేవలం వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం లేకపోవడమే అని స్పష్టంగా తెలుస్తుంది అని పలువురు ఆక్షేపిస్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే… సదరు నేత విశాఖపట్నం సీపీ మీనాను కలిసి ఆయన ఆఫీసు బయటే మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం.
ఇది ఇలా ఉండగా… ఈ మధ్య కాలంలో డీజీపీని హైకోర్టుకి రప్పించడం ఇది అప్పుడే రెండో సారి. సహజంగా ఇటువంటి పరిణామాలు ఆ స్థాయిలో ఉన్న అధికారులు చాలా నామోషీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ పరిస్థితి కూడా అంతే. పోలీసులు అధికారంలో ఉన్న వారి ఒత్తిడికి తలొగ్గినంత కాలం ఇటువంటివి తప్పవేమో!
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…