
కరోనా రహిత జిల్లా కావడంతో జిల్లా సరిహద్దులు మూసేసి బయట వారిని లోపలకి రాకుండా చర్యలు చేపట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఇటీవలే కేంద్రం ప్రకటించిన కరోనా ప్రభావిత జిల్లాల లిస్టులో ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న ఒకే ఒక్క గ్రీన్ జోన్ జిల్లా విజయనగరం. ఇప్పుడు ఆ హోదా పోయింది.
ఇది ఇలా ఉండగా… గడిచిన 24 గంటల్లో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,833కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 78 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 38కి చేరింది.
ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1015 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కేసులు పెరగడంతో ఇది ఎటు దారి తీస్తుందో అని ఆందోళనలో అందరు ఉన్నారు. పైగా జోన్ల పేరిట చాలా చోట్ల మినహాయింపులు ఇవ్వడంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందేమో అని అందరు అనుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారనే జగన్ మాట పై ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలోకి…
The TDP-Jana Sena alliance has witnessed unexpected developments in candidate selection for the Andhra Pradesh…