
“మొదట్లో మేము షూట్లో కొంత భాగం కోసం పూణేకి వెళ్లాలని అనుకున్నాం, కాని ఇప్పుడు హైదరాబాద్లో చేస్తాం. సినిమా 70% పూర్తయింది కానీ విఎఫ్ఎక్స్ కు సమయం పడుతుంది. ఇది సంక్రాంతికి సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వం అనుమతిస్తే పరిమిత సంఖ్యలో వ్యక్తులతో మేము షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము,” దానయ్య చెప్పారు.
అయితే, కొత్త విడుదల ప్రణాళికను నిర్మాత ధృవీకరించలేదు. ఆర్ఆర్ఆర్ 2021 జూలై 30 న విడుదల చేయవచ్చని కొన్ని పుకార్లు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం రాజమౌళి ఏదో ప్లాన్ చేస్తున్నారని దానయ్య సూచించాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ వాయిదా అనేది సినిమా ఇండస్ట్రీకి కొంత మేర మంచిదే అని చెప్పుకోవాలి. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వచ్చే పరిస్థితి ఉంటే ఒకే సినిమా విడుదల ఉంటుంది. వాయిదా పడితే మాత్రం కనీసం నాలుగైదు సినిమాలు పండగ ఎడ్వాంటేజ్ ని పొందుతాయి.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం లేదని జగన్ ముందే చెప్పేశారు. కానీ పార్టీ శ్రేణుల చేత వీర…
Janhvi Kapoor’s role in Ram Charan’s Peddi is back in discussion after Karan Johar brought…