
అడివి శేష్ హిట్ స్ట్రీక్ కి స్పీడ్ బ్రేకర్ గా మారిన సినిమా “డెకాయిట్”. శేష్ ప్రామిస్ చేసినదానికి, సినిమాలో కంటెంట్ కి సింక్ అవ్వకపోవడంతో ఆడియన్స్ చాలా నిరాశ చెందారు.
అయితే.. శేష్ సరిగ్గా ఏ రేంజ్ సినిమా తీయాలి అనుకున్నాడో, అరుణ్ మాతేశ్వరన్ తీసి చూపించాడు. నిన్న విడుదలైన డిసి సినిమా చూసినవాళ్ళందరూ అనుకుంటున్న విషయం ఇది.
హీరోహీరోయిన్ ఇద్దరూ కలిసి పోలీసులపై దాడి చేయడం మొదలుకుని.. హీరో కోసం హీరోయిన్ ప్రాణాలకు తెగించడం వరకు అన్నీ డెకాయిట్ మరియు డిసి సినిమాల్లో ఉన్నాయి.
అయితే.. డిసిలో కనిపించిన క్వాలిటీ & ఎమోషన్ డెకాయిట్ లో కనిపించలేదు. అందువల్ల ఆడియన్స్ ను ఎగ్జైట్ – ఎంగేజ్ చేయడంలో డిసి సక్సెస్ అయినట్లుగా డెకాయిట్ అవ్వలేకపోయింది.
కంటెంట్ లో క్వాలిటీ ఉంటే చాలు.. ప్రేక్షకులకు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనే లెక్కలు ఉండవని. సినిమాకి కావాల్సిందల్లా మంచి టెక్నికల్ టీమ్ అని, అది బాగుంటే యాక్టర్స్ స్టార్ డం అనేది బోనస్ మాత్రమేనని డీసీ మరోసారి స్పష్టం చేసింది.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…