Telugu

ఇంతకీ మెగా ఫ్యామిలీ ఏం చేసిందో?

పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగలేకపోవడానికి కారణమైన అనేక అంశాలలో ఇద్దరు సోదరులు కూడా ఓ కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షకులలో గొప్ప ఇమేజ్ ను సొంతం చేసుకున్న పెద్ద అన్నయ్య చిరంజీవి ఏమో.., జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశంసలు కురిపిస్తూ, జనసేన ద్వారా తమ్ముడు చేసే పోరాటాలకు అడ్డు తగులుతుంటారు. మరో అన్నయ్య నాగబాబు ఏమో.., ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు, అవి కూడా ఏ మాత్రం పరిపక్వత లేకుండా తిరిగి మళ్ళీ వారినే విమర్శించే విధంగా వ్యాఖ్యలు చేసి ‘జనసేన’కు నష్టం చేకూరుస్తుంటారు.

తాజాగా అలాంటి వ్యాఖ్యలనే నాగబాబు మరోసారి పలికారు. పవన్ కళ్యాణ్ వంటి హీరో సినిమాపై జగన్ సర్కార్ పగబట్టి ఇంతలా చేస్తుంటే, ఏ ఒక్క పెద్ద హీరో కూడా కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడకపోవడం నిజంగా చాలా దురదృష్టం, ఇది కరెక్ట్ కాదు అంటూ కనీసం ఓ ట్వీట్ గానీ, ఓ మాట గానీ ఎవరూ చెప్పలేకపోయారు, ఎవరో ఒకరిద్దరూ చెప్పినా అది ప్రజల్లోని పెద్దగా వెళ్లలేదని, టాలీవుడ్ లోని టాప్ హీరోలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

ఇక నిర్మాతలు, దర్శకులు ఉన్నారు, ‘ఇది తప్పు’ అని ఎందుకు చెప్పలేకపోతున్నారని, ‘మిమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నారా? మీ జీవితాలను నాశనం చేసేస్తారా? మనం ఇలా భయపడితే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మీరు కళ్యాణ్ కు సహకారం అందించినా, లేకున్నా, భవిష్యత్తులో మీకు అలాంటి ఆపద వస్తే పవన్ కళ్యాణ్ గానీ, తాను అండగా ఉంటామని, వచ్చి నిలదీస్తామని’ చాలా కంట్రోల్ గా చక్కగా చెప్పారు నాగబాబు.

మెగా బ్రదర్ ఎలాంటి అసభ్య పదజాలాన్ని తావు లేకుండా చక్కగా మాట్లాడారు. ఇండస్ట్రీలోని “ఐకమత్యత” గురించి మరోసారి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చెప్పుకొచ్చారు. తప్పు లేదు, అయితే తోటి హీరోలను వ్రేలెత్తి చూపించే ముందు కుటుంబ వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ కు మీరు ఎంత అండగా నిలబడ్డారో కూడా ఒక్కసారి సవివరంగా తెలిపితే అభిమానులు గానీ, సినీ ప్రేక్షకులు గానీ తెలుసుకునే వారు కదా, అలాగే మీరు చేసిన సాయం విని సంతోషించే వారు కదా!

ఒక సాధారణ నటుడు పోసాని కృష్ణమురళీ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ను గానీ, ఆయన కూతురు గురించి గానీ అనరాని మాటలు మాట్లాడితే మెగా ఫ్యామిలీ నుండి ఏ ఒక్క వ్యక్తి అయినా మీడియా ముందుకు వచ్చి వాటికి బదులిచ్చారా? ముందు దీనికి సమాధానం చెప్పిన తర్వాత మెగా ఫ్యామిలీ మరొకరి నుండి ఎలాంటి సహకారం అయినా ఆశిస్తే బాగుంటుంది. మరి ఏ భయంతో సొంత కుటుంబ సభ్యులు స్పందించలేదో కూడా నాగబాబు చెప్తే బాగుండేది.

నిజంగా నాడు పోసాని చేసి వ్యాఖ్యలు ఎంత జుగుప్సాకరమైనవంటే, ఏ అభిమాని అయినా వాటిని తలచుకుంటేనే ఆగ్రహం కట్టలు తెంచుకునేటంతగా ఉన్నాయి. మరి అలాంటి వ్యాఖ్యలకు కుటుంబం నుండి కనీస స్పందన లభించదా? ఇంకా కుటుంబం ఉండి విలువెందుకు? ఎదుటి వారిపై రాళ్లు వేసే ముందు, మనం సరిగా ఉన్నామా? లేదా? అన్నది కూడా మననం చేసుకోవాలి కదా. ఆ విషయంలో అయితే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పవన్ కు ఏ రకంగానూ సహాయం చేయలేదని చెప్పవచ్చు.

ఇంతలా అడిగిన నాగబాబు, తన తనయుడు వరుణ్ తేజ్ చేత ప్రెస్ మీట్ నిర్వహించి, బాబాయ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించగలరా? అంటే దానికి ‘సమాధానం’ చెప్పనవసరం లేదు. అలాగే మెగా ఫ్యామిలీలోనే వరుణ్ ను పక్కన పెడితే, ముగ్గురు టాప్ హీరోలు ఉన్నారు. కనీసం ఏ ఒక్క హీరో అయినా తమ భావాలను బయటపెట్టారా? సొంత కుటుంబ సభ్యులకే లేకపోతే, బయట వారి నుండి ఏ విధంగా ఆశించాలి? అన్న చిన్న పాయింట్ ను నాగబాబు ఎలా మిస్ అయ్యారో!

ఇదంతా కాదు అనుకున్నా, పవన్ ను గానీ, ఆయన నటించిన సినిమాను గానీ వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తోంది ఒక హీరోగా కాదు, జనసేన అనే రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకుని అని నాగబాబు గుర్తుంచుకోవాలి. ఒకవేళ జనసేన అనే పార్టీని స్థాపించకుండా పవన్ ఒక సినిమా హీరోగానే ఉండి ఉంటే, నిజంగా వైసీపీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడేదా? అంటే కాదనే సమాధానమే వస్తుంది. దీంతో పవన్ వలనే సినీ పరిశ్రమకు ఈ సమస్యలు అన్న అంశం ఇప్పటికే ఇండస్ట్రీలో పాతుకుపోయింది.

ప్రజాస్వామ్య విధానంలో జనసేన గానీ, పవన్ కళ్యాణ్ గానీ నడుచుకుంటున్నారు. కానీ వైసీపీ అధికారం అనే ఆయుధంతో పనిచేస్తోంది. ఈ రెండింటి బలాల నడుమ సినీ పరిశ్రమ చిక్కుకుంది. ఇది జగమెరిగిన సత్యం. దీని కోసం ఇతర హీరోలు కూడా పోరాడితే, వారిని కూడా జనసేన కార్యకర్తలుగానో, పవన్ పార్టీకి సహకారం అందిస్తున్న వారిగానో మీడియా ముద్ర వేస్తుంది. కాబట్టే ఏ ఒక్క హీరో కూడా బయటకు వచ్చి సహకారం అందించలేకపోతున్నారని నాగబాబు అర్ధం చేసుకోవాలి.

ఇప్పటికే సినిమా – రాజకీయం రెండూ ఒకదానికొకటి పెనవేసుకుపోయి సమస్యలు ఎక్కువయ్యాయి. దీనిని మరింత లోతుకు తీసుకువెళ్లాలనుకుంటే నాగబాబు చేసిన అపరిపక్వత విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అలా కాకుండా సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే, ప్రస్తుతం చిరంజీవి నడిపిస్తున్న మార్గంలో నడవాల్సి ఉంటుంది. నాగబాబు పేర్కొంటున్న టాప్ హీరోలందరూ తన మరో సోదరుడు చిరు మార్గాన్నే ఎంపిక చేసుకుని అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఈ ముగ్గురు సోదరులలోనే ఎంత వ్యత్యాసం ఉందో గమనించారా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Spirit: Will Sandeep Vanga Correct Himself?

Prabhas and Sandeep Reddy Vanga’s Spirit continues to remain one of the most talked-about upcoming…

2 hours ago

Constant Ticket Inflation is Pushing Audiences to the Edge

The commercial strategy surrounding the release of Peddi has exposed a worrying trend in regional…

2 hours ago