Telugu

సెలవులు ముగిసాయి… ఎప్పుడు సెలవిస్తారో..?!

రంజాన్ పండగ అంటూ దాదాపుగా గడిచిన ఏడెనిమిది రోజుల నుండి రాజకీయాలకు జనసేన అధినేత దూరంగా ఉంటున్నారు. పోరాటయాత్ర పేరుతో సాగిస్తోన్న పర్యటనకు రంజాన్ సందర్భంగా బ్రేక్ ఇచ్చిన జనసేన అధినేత, మళ్ళీ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారనేది ఇంకా సెలవివ్వలేదు. ఈ ఏడెనిమిది రోజుల నుండి కూడా బాహ్యా ప్రపంచానికి అందుబాటులో లేకపోవడంతో, ‘పార్ట్ టైం పొలిటిషియన్’ అన్న విమర్శలకు మరోసారి తావిచ్చినట్లయ్యింది.

పోరాటయాత్రకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ట్విట్టర్ ద్వారా అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తే… అది కాస్త ఫస్ట్ పోస్ట్ తోనే బెడిసికొట్టింది. దీంతో ట్విట్టర్ లో కనుమరుగయ్యారు. రంజాన్ శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రం ఓ స్టిల్ ని పోస్ట్ చేసిన పవన్, తదుపరి ప్రణాళిక ఏమిటన్నది వెల్లడించకపోవడంతో అభిమానులంతా ఎప్పుడు బరిలోకి దిగుతారోనని వేచిచూస్తున్నారు. బహుశా “అధిష్టానం” నుండి ఆదేశాలు రావాలేమో అనడం విమర్శకుల వంతవుతోంది!

ADVERTISEMENT

పోరాటయాత్రలో దొర్లిన పొరపాట్లు రిపీట్ కాకుండా స్థానిక సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టుకునేందుకే ఈ బ్రేక్ అంటున్నాయి జనసేన వర్గాలు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, ప్రస్తుతం జనసేన అధినేత దానిపైనే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారన్న టాక్ ఉంది. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ఇలా వారం, పది రోజుల పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉండడం మాత్రం సరైన నిర్ణయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

సురేఖ సంకేతాలు…బిఆర్ఎస్ ను ఆకర్షిస్తాయా.?

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజగా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో…

4 minutes ago

Another Hit for Director or Will a Curse Strike Dhanush?

Dhanush's most anticipated film Om: Chapter 1, directed by Rajkumar Periyasamy, is gearing up for…

14 minutes ago