Telugu

రష్మికకు మళ్ళీ హిట్టు పడేదెప్పుడో?

కన్నడ భామ రష్మిక మందన తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన వెంటనే వరుసగా హిట్స్ పడటంతో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. సూపర్ డూపర్ హిట్ పుష్పలో అల్లు అర్జున్‌తో పోటీ పడి నటించి రష్మిక అందరి మన్ననలు అందుకొంది. పుష్పతో రష్మిక మరింత ఎత్తుకి ఎదిగిపోయింది.

అయితే చాలామంది హీరోహీరోయిన్లలాగే ఆమె కూడా సరైన కధలు ఎంచుకోలేక అప్పుడప్పుడు తన హిట్ రికార్డుల ఖాతాలో కొన్ని ఫ్లాపులు కూడా జోడించుకొంటోంది. అందుకు తాజా ఉదాహరణగా శర్వానంద్‌తో చేసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఉంది. ఆ సినిమా ఫ్లాప్ అవడం వారిద్దరికీ తీవ్ర నిరాశ కలిగించింది.

ADVERTISEMENT

ఓ సూపర్ హిట్ తరువాత రష్మిక ఖాతాలో మళ్ళీ ఓ ఫ్లాప్ పడింది కనుక మళ్ళీ మరో హిట్ కోసం ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప-2, దుల్ఖర్ సల్మాన్ హీరోగా వస్తున్న సీతారామం, దళపతి 66 సినిమాలున్నాయి. వీటిలో పుష్ప-2 తప్పకుండా హిట్ అవుతుంది కానీ అది విడుదలయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉంది. కనుక ఈలోగా రష్మిక ఖాతాలో మరో హిట్ పడుతుందో లేదో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bring Jagan To Court Everyday: ED Asks HC!

The pending enforcement directorate and central bureau of investigation cases against Jagan had been jurisdiction…

15 minutes ago

అక్రమాస్తుల కేసులకీ.. టీనేజ్‌ వచ్చేసింది

2011వ సంవత్సరంలో పుట్టిన పిల్ల లేదా పిల్లాడి వయసు ఇప్పుడు ఎంత అంటే 15 ఏళ్ళు! అని టక్కున సమాధానం…

40 minutes ago