
మంచు విష్ణు,మంచు లక్ష్మి,మంచు మోహన్ బాబు ల వీడియోల్లో తప్పులను వెతికిపట్టుకుని,పాత వీడియోలు కూడా వదలకుండా ..యూట్యూబ్ లో ట్రోలింగ్ చానెల్స్ కామెడీ వీడియోలు పెట్టి మంచు ఫ్యామిలీని ఇబ్బందికి గురిచేశాయి.
ఆఖరికి మోహన్ బాబు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ట్రోలర్స్ మీద కంప్లైంట్ ఇచ్చానని చెప్పిన వీడియోని కూడా ట్రోలర్స్ వదిలిపెట్టలేదు. కొన్ని యూట్యూబ్ చానెల్స్ ని మోహన్ బాబు మూయించినా.. మంచు ఫామిలీ మీద ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. ఇటీవల రిలీజ్ అయ్యిన విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ట్రైలర్ ని కూడా బాగా ట్రోల్ చేసారు.
ఈరోజు జరిగిన విలేఖరుల సమావేశం లో, మంచు విష్ణు తమ కుటుంబం పై జరుగుతున్న ట్రోలింగ్ పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. జూబిలీ హిల్స్ లోని ఓ కంపెనీ లో.. 21 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారని,వాళ్ళ వెనుక ఉన్న ప్రముఖ హీరో ఐ పి అడ్రస్ కూడా తమకు లభించిందని తెలిపారు. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నామని, మంచు ఫామిలీ జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు.
ఈ వీడియో కొన్ని గంటలముందే రిలీజ్ అయ్యింది. మంచు విష్ణు చెప్పింది విని ట్రోలర్స్ ట్రోలింగ్ ఆపేస్తారో ? లేక ఈ వీడియోను కూడా ట్రోలింగ్ చేస్తారో ? వేచి చూడాలి.
ఒక్కరా? ఇద్దరా ? సోషల్ మీడియా లోని ట్రోలర్స్ ని కంట్రోల్ చేయతరమా?
Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…
In the Bigg Boss TV reality show, every season, someone gets a lot of push.…