Telugu

టెస్ట్ లో ప్రయోగాలు చేస్తే ఉపయోగాలుండవా.?

గడిచిన కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ను కన్వెన్షనల్ స్టైల్ లో కాకుండా అగ్రెసివ్ గా ఆడుతూ, ఆ ఆటతీరును ‘బ్యాజ్-బాల్’ అంటూ సంబోధిస్తూ టెస్ట్ క్రికెట్ చరిత్ర లో ఇదొక రెవల్యూషన్ అవుతుంది అన్నారు. బ్రెండన్ మెక్-కలం ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ హెడ్ కోచ్ గా పగ్గాలు అందుకున్నాక ఈ బ్యాజ్-బాల్ శకం మొదలయింది.

జో రూట్ కెప్టెన్సీ లో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ఎన్నడూ చూడని పరాజయాలను, అవమానాలను చూడక తప్పలేదు. సొంత గ్రౌండ్లలోనే ప్రత్యర్థుల చేత మట్టికరిచారు వారు. అయితే, అప్పుడు ఫార్మర్ న్యూజిలాండ్ బ్యాటర్ మెక్-కలం ఇంగ్లాండ్ కోచ్ గా మారి, స్టోక్స్ తో జతకట్టి ఇంగ్లాండ్ జట్టును ఫియర్లెస్ జట్టుగా మార్చాలనుకున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ కాంబో టెస్ట్ క్రికెట్ లో కొత్త సంచలనం సృష్టించిందనే చెప్పాలి. మెక్-కలం అగ్రెసివ్ మైండ్-సెట్ కు స్టోక్స్ డిటెర్మినేషన్ తోడయ్యి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఇంగ్లాండ్ జట్టు ను చూసే వైఖరి మార్చింది. ఫుల్-ఆన్-ఫుల్ అగ్రెసివ్ క్రికెట్ తో కొత్త తరం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది బ్యాజ్-బాల్ ఎరా.

అయితే ఇలాంటి పెను మార్పులు టి-20 లేదా వన్-డే ఫార్మాట్లలో లాంగ్-టర్మ్ సక్సెస్ తీస్కువచ్చే అవకాశాలేమైనా ఉండచ్చేమో కానీ, టెస్ట్ క్రికెట్ లో ఎప్పటికైనా పేషన్స్ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, దీన్ని ఇంగ్లాండ్ జట్టు గ్రహించే లోపే మరొక దిగ్గజ జట్టు ఇదే దారిని ఎంచుకుంది.

భారత జట్టు గౌతమ్ గంభీర్ కోచ్ పగ్గాలను అందుకున్నప్పటి నుండి బ్యాజ్-బాల్ ను అలవరుచుకున్నారనే బదులు, టెస్ట్ క్రికెట్ లో ఒక రకమైన అగ్రేషన్ ను చూపారు. నిలకడ లేని ప్లేయింగ్-11 తో అపోజిషన్ ను ప్రతి మ్యాచ్ లో కొత్త కొత్త కాంబినేషన్లతో షాక్ ఇద్దామనుకున్న భారత్ కు రిటర్న్ షాక్ తగిలింది.

ప్రత్యర్ధులు మనను అంచనా వేయటం గురించి పక్కన పెడితే, ఆఖరికి మన జట్టు సభ్యులే ప్లేయింగ్-11 లో ఎవరుంటారు, ఉన్నప్పటికీ వారు ఎవరు ఏ స్థానంలో ఆడతారో అని సందిగ్ధం లోనే ఉండేవారు. అలాగే, సీనియర్స్ ను జట్టులో నుండి తొలగించి, యువ రక్తంతో జట్టులో అగ్రేషన్ ను పెంచేద్దామనుకున్న గౌతీ ప్లాన్ బెడిసికొడుతూనే వస్తుంది.

అప్పటికే ఇంగ్లాండ్ ను చూసిన అనుభవమో ఏమో తెలియదు కానీ, ఆ తీరును మార్చుకున్నప్పటికీ భారత్ కు టెస్ట్ ఫార్మాట్ లో మంచి రోజులు నడవడం లేదు. ఇటు పక్క ఇంగ్లాండ్ చూసుకున్నా, గత 5 టెస్ట్ సిరీస్ లలో 3 సిరీస్ లో ఓటమి పొంది మిగతా 2 సిరీస్ లు కూడా కేవలం డ్రా చేసుకోగలిగింది ఇంగ్లాండ్.

మరో పక్క గౌతమ్ గంభీర్ వచిన్నప్పటినుండి చూస్కుంటే, 6 సిరీస్ లు ఆడిన భారత్ కేవలం 2 సిరీస్ లు కైవసం చేసుకోగలిగింది, అలాగే 3 సిరీస్లలో ఓటమి చెంది, 1 సిరీస్ ను డ్రాగా ముగించింది. గంభీర్, మెక్-కలం ప్లేయర్స్ గా ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా, కోచ్ గా తమని తాము పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

చిన్న సినిమాలు చూపిస్తున్న పెద్ద దారి..

సినిమా అంటే భారీ బడ్జెట్‌.. స్టార్‌ హీరో.. వందల కోట్ల మార్కెట్‌.. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో విజయానికి కొలమానంగా మారినట్లు…

16 minutes ago

Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?

Suriya's Vishwanath and Sons directed by Venky Atluri was released in theatres on August 14th…

30 minutes ago