
అయితే ‘బాహుబలి-2’ కూడా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రశ్నకు ఇంతవరకు పరోక్షంగా కూడా ఎలాంటి జవాబు లభించలేదు. అటు దర్శక నిర్మాతలు కాని, ఇటు నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఎవరూ నోరు మెదపకుండా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అయితే అసలు బాహుబలిని చంపేసిన కట్టప్పనే ఈ ప్రశ్న వేస్తే… అవును సరిగ్గా ఇదే ఆలోచన వచ్చిన మీడియా బృందం సత్యరాజ్ ను పలకరిస్తూ ఈ ప్రశ్న వేసింది. దానికి సమాధానంగా…
“ఈ ప్రశ్నను ఇప్పటి వరకు నన్ను చాలా మంది అడిగారు. అయినా నాకేమీ ఇబ్బందిగా లేదు. మీకో విషయం తెలుసా? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని నా కుటుంబ సభ్యులకు కూడా నేను ఇంత వరకు చెప్పలేదు. రెండో భాగం విడుదలయ్యేంత వరకు ఈ విషయం రహస్యంగానే ఉంటుంది” అని సత్యరాజ్ తెలిపాడు. సోషల్ మీడియాలో కట్టప్పను బాగా వాడుకున్నారని… నోట్ల రద్దు సమయంలో కూడా కట్టప్ప క్యారెక్టన్ ను బాగా వాడుకున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. తాను పోషించిన క్యారెక్టర్ కు ఇంత స్థాయిలో ఆదరణ లభించడం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాడు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…